ఏపీ పోలీసులు వైసీపీ వైపు ఉన్నారా..? : నారా లోకేష్

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొద్ది రోజుల నుంచి  అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ మ‌ధ్య కాలంలో మాట‌ల యుద్ధంలో టీడీపీనేత ప‌ట్టాభిరామ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా టీడీపీ నేత బుద్దా వెంక‌న్న మంత్రి కొడాలి నానికి సవాల్ విసిరారు. దీంతో సోమ‌వారం రాత్రి బుద్దా వెంక‌న‌న‌ను అరెస్ట్ చేయ‌డంపై టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.
గుడివాడ‌లోని కొడాలి నాని క్యాసినో న‌డిపితే నో పోలీస్‌..?  అదే గ‌డ్డం గ్యాంగ్ ప్ర‌తిప‌క్ష నేత కార్యాల‌యాన్ని వైసీపీ మూక‌లు ధ్వంసం చేస్తే నో పోలీస్ అంటూ లోకేశ్ ప్ర‌శ్నించారు. బూతులేంట్రా స‌న్నాసి అని బుద్దా వెంక‌న్న నిల‌దీస్తే.. బిల‌బిల‌మంటూ మంచి పోలీసులు అరెస్ట్ చేసార‌ని మండి ప‌డ్డారు నారాలోకేష్‌. ఏపీ పోలీసులు ప్ర‌జాప‌క్షం వైపున‌కు ఉన్నారా..?  లేక నేరాలకు పాల్ప‌డే వైసీపీ నేత‌ల‌కు కాప‌లా కాస్తున్నారా అంటూ విమ‌ర్శించారు. టీడీపీ నేత బుద్దా వెంక‌న్న అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం ని పేర్కొన్నారు.
క్యాసినో వ్య‌వ‌హారంపై టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేయ‌డానికి వెళ్లితే.. క‌నీసం అనుమతించ‌ని డీజీపీ ఐపీఎస్ ముసుగులో ఎన్నాళ్లు ఇలా వైసీపీ కోసం ప‌ని చేస్తారు అని ఆగ్ర‌హించారు. వైసీపీలో చేరితే వాటాలు లేకుండా మీరే క్యాసినో న‌డుపుకోవ‌చ్చు అంటూ నారా లోకేష్ ఎద్దేవా చేసారు. మ‌రొక‌వైపు జ‌గ‌న్ దుర్మార్గ‌పు పాల‌న‌కు తోడు పోలీసుల దౌర్జ‌న్యం తోడు అయింద‌ని టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యులు య‌న‌మ‌ల రామృష్ణుడు పేర్కొన్నారు.
స‌మాజంలో అల్ల‌ర్లు సృష్టిస్తూ అరాచ‌కాలు చేస్తున్న వైసీపీ గుండాలను వ‌దిలి టీడీపీ నేత‌ల‌పై పోలీసులు జూలుం ప్ర‌ద‌ర్శిస్తున్నారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. పోలీసులు త‌మ నెత్తి మీద మూడు సింహాల‌కు బ‌దులు 3 ఫ్యాన్ రెక్క‌లు పెట్టుకొండి అంటూ మండిప‌డ్డారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కొడాలి నాని.. కొంత మంది వైసీపీ నేత‌లు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే విధంగా స‌భ్య‌స‌మాజం త‌లదించుకునేలా చంద్ర‌బాబునాయుడ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేసిన బుద్దా వెంక‌న్న‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసారు య‌న‌మ‌ల‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: