ఎపీ : వాలంటీర్లకు అదనంగా పార్టీ బాధ్యతలు?


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్కును తీసుకు వచ్చారు. గ్రామ పంచాయతీల్లో గ్రామవాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టి లక్షలాద9ి మందికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం వారికి అదనంగా పార్టీ బాధ్యతు అప్పగించనున్నారు. ఎప్పటి నుంచో తెలుసా ?
ఆంధ్ర ప్రదేశ్ సి.ఎం. వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఇక నుంచి గ్రామ వాలంటీర్లను పార్టీ ప్రయోజనాలకు వినియోగించనున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించక పోయినా ఆ పార్టీ  ఎం.ఎల్.ఏ ఈ విషయాన్ని పరోక్షంగా బహిర్గతం చేశారు. మరో రెండు సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కార్యాచరణ ఆరంభించాలని సూచించారు. వాలంటీర్లు పూర్తి స్థాయిలో పార్టీ పని చేయాలని సదరు ఎం.ఎల్.ఏ బహిరంగంగానే పేర్కోనటం విశేషం. ఇంతకీ ఎవరా ఎం.ఎల్ .ఏ.?
కృష్ణా జిల్లాకు చెందిన శాసన సభ్యుడు జోగి రమేష్ పెడన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు. నియోజక వర్గ పరిధిలోని గూడూరు, పెడన, బంటుమల్లి, కృత్తివెన్న మండలాల లోని ముఖ్యనాయకులతో ఆయన సమావేశమై పార్టీ స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యా చరణ ఆరంభించాలని పార్టీ  శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగులు ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలు తిప్పికొట్టాలని కూడా ఆయన పిలుపు నిచ్చారు. నియోజక వర్గ పరిధిలోని  పన్నెండు వందల మందకి గ్రామ వాలంటీర్లకు అదనంగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని బహిరంగంగానే తెలిపారు. ఒక్కో వాలంటీర్ కు ఒకరిద్దరు చొప్పున పార్టీ కార్యకర్తలను అనుసంధానం చేస్తామని ఎం.ఎల్.ఏ జోగి రమేష్ చెప్పారు ఫిబ్రవరి రెండు మూడు తేదుల నుంచి వీరంతా ఇక పై క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీ ప్రచారం చేస్తారని తెలిపారు. ప్రతి గడప తొక్కి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను వింటారని, ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలకు ప్రచారం కల్పిస్తారని జోగి రమేష్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: