మోదీ దెబ్బ అదుర్స్.. యోగికి ఇక కష్టకాలమే..

Deekshitha Reddy
మోదీతో పెట్టుకుంటే ఎవరికైనా చుక్కలు చూపించక మానరు అనేది ఆయన గురించి బాగా తెలిసినవారు చెప్పే మాట. ఆమధ్య ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి ఓ ప్రచారం జోరందుకుంది. మోదీ వారసుడు ఆయనేనని, దేశ ప్రధానిగా పనిచేసేందుకు అర్హత ఉన్న ఏకైక వ్యక్తి యోగి అని యూపీ కేంద్రంగా సోషల్ మీడియా ప్రచారం జోరందుకుంది. తనని తాను పీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేసుకునేందుకు యోగి ఈ ప్రచారం మొదలు పెట్టారా, లేక అభిమానులే అత్యుత్సాహంతో ఆ పని చేశారా అనేది తెలియదు కానీ.. మొత్తానికి ఆ ప్రచారం యోగీ సీటు కిందకి నీళ్లయితే తెచ్చింది.
పొమ్మనలేక పొగ పెడుతున్నారా..?
గతంలోనే యోగీని యూపీ సీఎంగా దించేస్తున్నారని, ఆ స్థానంలో కొత్తవారికి అవకాశమిస్తున్నారనే ప్రచారం జరిగింది. అప్పట్లో యోగి కూడా ఢిల్లీలోనే మకాం పెట్టి ఆ వ్యవహారాన్ని సర్దుబాటు చేసుకున్నారు. అయిష్టంగానే కొంతమంది కొత్తవారిని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. తీరా యూపీ ఎన్నికల సమయానికి అంతా సర్దుబాటు అయిందనుకునే క్రమంలో ముగ్గురు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీని వీడి ఎస్పీలో చేరడంతో కథ మొదటికి వచ్చింది. యోగీ నాయకత్వంపై అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి.
యోగి సీటు మార్పు..
బీజేపీ యూపీ అసెంబ్లీ ఎన్నికలకోసం విడుదల చేసిన తొలి జాబితా యోగి అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారింది. అందులో యోగి పోటీ చేసే స్థానాన్ని గోరఖ్ పూర్ అర్బన్ గా ఖరారు చేశారు. వాస్తవానికి యోగి.. ఈసారి అయోధ్య లేదా మధుర నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయన స్థానాన్ని అనూహ్యంగా గోరఖ్ పూర్ కి మార్చారు. గతంలో యోగి, గోరఖ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచినా, ప్రస్తుతం ఆయనకి అక్కడ కలిసొచ్చే పరిణామాలేవీ లేవు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కీలక నేతలంతా గోరఖ్ పూర్ నియోజకవర్గం ఉన్న పూర్వాంచల్ ప్రాంతానికి చెందినవారే. సో అక్కడ పార్టీ బాగా వీక్ గా ఉంది. ఈ టైమ్ లో యోగీని అక్కడినుంచి పోటీ చేయాలని అధిష్టానం చెప్పింది అంటే దాని అర్థం ఏంటి..? టైమ్ బాగోలేక యోగి అక్కడినుంచి ఓడిపోతే.. అతడిని పక్కనపెట్టేస్తారని అంటున్నారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు.. యోగికి అసెంబ్లీ ఎన్నికల ముందు మోదీ టీమ్ అగ్నిపరీక్ష పెట్టింది. దీంతో యోగి లో టెన్షన్ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: