రాయలసీమ : పరిటాలకు చుక్కలు కనిపిస్తున్నాయా ?

Vijaya


క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ధర్మవరం నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి యాక్టివ్ అయిపోవటమే ఇందుకు ప్రధాన కారణం. 2019 ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత సూరి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. దాంతో నియోజకవర్గం ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ ను చూసుకోమని చంద్రబాబునాయుడు చెప్పారు.అసలే దర్మవరంపై ఎప్పటినుండో కన్నేసున్న శ్రీరామ్ వెంటనే నియోజకవర్గంలో యాక్షన్లోకి దిగేశారు. అప్పటి నుండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అంటు అభ్యర్ధి హోదాలోనే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే హఠాత్తుగా బీజేపీకి రాజీనామా చేసిన సూరి మళ్ళీ టీడీపీలోకి వచ్చేశారు. రావటం రావటమే తన మద్దతుదారులతో జోరు పెంచేశారు. దాంతో ఇటు పరిటాల శ్రీరామ్ అటు వరదాపురం సూరి ఇద్దరి మధ్య గొడవలు మొదలైపోయాయి.నిజానికి 2014-19 మధ్యే వీళ్ళ వర్గాల మధ్య చాలా గొడవలు జరిగాయి. 2019లోనే సూరిని కాదని ధర్మవరంలో పోటీ చేయటానికి శ్రీరామ్ చాలా ట్రై చేశారు. అయితే చంద్రబాబు దగ్గర సూరికి గట్టి పట్టుడంతో శ్రీరామ్ ప్రయత్నాలు  సాగలేదు. ఇపుడు తాజా పరిస్దితి ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ధర్మవరంలో ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో క్యాడర్లోనే అయోమయం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శ్రీరామ్ చేసిన ప్రకటన తెలిసిందే.నిజానికి శ్రీరామ్ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా జనాలకైతే నష్టమూ లేదు లాభమూ లేదు. ఏదో చంద్రబాబును బెదిరించటానికి మాత్రమే రాజకీయ సన్యసమనే ప్రకటన చేశారు. ఇప్పటికీ చంద్రబాబు గుడ్ లుక్స్ లో సూరి ఉన్నారన్నది వాస్తవం. అందుకనే శ్రీరామ్ లో అభద్రత మొదలైపోయింది. ఎలాగూ పరిటాల ఫ్యామిలీకి పోటీ చేయటానికి రాప్తాడు నియోజకవర్గం ఉంది. మొన్నటి ఎన్నికల్లో పరిటాల సునీతకు చంద్రబాబు టికెట్ ఇస్తే పోటీచేసింది శ్రీరామే.కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా శ్రీరామ్ ను రాప్తాడులోనే పోటీ చేయమని చంద్రబాబు చెప్పే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. అంటే ధర్మవరంలో సూరికే లైన్ క్లియర్ చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. దీనికి శ్రీరామ్ అంగీకరించటంలేదు. అయితే సూరి మాత్రం శ్రీరామ్ కు ఇప్పటి నుండే చుక్కలు చూపిస్తున్నారు. నియోజకవర్గంలో అన్నీ తానై పర్యటించటంతో పాటు కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: