ఆ ఇద్దరి ‘రాజా’లు మళ్ళీ ‘రాజు’లేనా?

M N Amaleswara rao
అధికార వైసీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్నారు? ఈ రెండున్నర ఏళ్ల తర్వాత కూడా బలం తగ్గని ఎమ్మెల్యేలు ఎవరంటే? చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. కాకపోతే గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితి మాత్రం ఇప్పుడు లేదనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో అంటే పూర్తిగా వైసీపీ హవా ఉంది...దీంతో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చేసింది. కానీ ఈ రెండున్నర ఏళ్లలో చాలావరకు సీన్ మారింది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం.
అయితే ఇంకా మెజారిటీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్తితుల్లో కూడా చాలామంది బలంగా ఉన్నారు. ఇక ఇందులో మళ్ళీ పలువురు ఎమ్మెల్యేలు...నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలవగలరని చెప్పొచ్చు. అలా నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలిచే సత్తా ఉన్న వారిలో దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజాలు ఉంటారని చెప్పొచ్చు. ఈ రెండున్నర ఏళ్లలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై పెద్దగా వ్యతిరేకత రాలేదు. పైగా వీరు ప్రత్యర్ధులుగా ఉన్న టీడీపీ నేతలు కూడా అనుకున్న స్థాయిలో బలపడలేదు.
దాడిశెట్టి రాజా గత రెండు పర్యాయాలుగా తుని నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అసలు తుని అంటే యనమల రామకృష్ణుడు కంచుకోట. అక్కడ ఆయన ఆరుసార్లు గెలిచారు. అలాంటి యనమల కంచుకోటని వరుసగా రాజా రెండు సార్లు బద్దలుగొట్టారు. ఇక ఇప్పటికీ తునిలో రాజా స్ట్రాంగ్‌గా ఉన్నారు. యనమల ఫ్యామిలీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా దాడిశెట్టి దూసుకెళుతున్నారు.
అటు రాజానగరంలో జక్కంపూడి రాజా కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు. గత ఎన్నికల్లో రాజానగరం నుంచి దాదాపు 31 వేల ఓట్ల మెజారిటీతో రాజా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి గెలిచినా సరే నియోజకవర్గంపై మంచి పట్టు తెచ్చుకున్నారు. రెండున్నర ఏళ్లలో ఎక్కువ వ్యతిరేకత కూడా తెచ్చుకోలేదు. అటు టీడీపీ నేత పెందుర్తి వెంకటేష్ పెద్దగా పుంజుకోలేదు. ఇక ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం కూడా తక్కువే. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా రాజాలకు తిరుగుండదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: