యువతరమా మేలుకో.. నీ లక్ష్యాన్ని చేరుకో..!

MOHAN BABU
45 శాతానికి పైగా యువత ఉన్న ఏకైక దేశంగా భారత దేశాన్ని గర్వంగా చెప్పుకుంటారు. ఇతర దేశాలలో మధ్యవయస్కులు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్టు ఒక అంచనా. యువత మీద దేశం అనేక ఆశలు పెట్టుకుంటోంది. వారి ఆలోచన, ప్రవర్తన ,ఆచరణ, దృక్పథం, సిద్ధాంత ప్రాతిపదిక, సవాళ్లను అధిగమించే తత్వం యువత యొక్క శక్తిని అంచనా వేయడానికి బాగా ఉపయోగపడతాయి.
      మనిషి ఆలోచనలు వక్రమార్గం పట్టించి, కర్తవ్యం మీద కేంద్రీకరించ కుండా చేసి, సృజనాత్మకంగా ప్రశ్నించే స్థాయి నుంచి  దేనిని పట్టించుకోని స్థబ్ధతకు తీసుకువచ్చే దుర్మార్గపు అవలక్షణాలు ఎన్నో. విద్యా రంగంలోనూ, సమాజంలోనూ ,చేతిలో సెల్ ఫోన్,  సినిమాలు, సీరియల్ లోని వక్ర ధోరణి ప్రజలను ముఖ్యంగా యువతను పెడదారి పట్టిస్తున్నాయి.


   పొరపాటు ఎక్కడ జరుగుతుంది..?
 ఇవ్వాళ మధ్యతరగతి, ఉన్నత తరగతి వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలు యువకులు యువతులు ఆర్థిక స్థితిని బట్టి విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి, వివిధ ప్రాంతాలు పర్యటించడానికి ,మొక్కుబడి ప్రయాణాలకు సిద్ధపడుతున్న వేళ పేద కుటుంబాల్లోని పిల్లలు కూడా వీరిని అనుసరించక తప్పడం లేదు. నాగరికత ముసుగులో నిత్యజీవితంలో వస్తున్న పెనుమార్పులు, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి కూడా కొంత వరకు మనిషి అతిగా ఆలోచించడానికి, ఊహా లోకంలో విహరించడానికి కారణమవుతున్నాయి.


   అట్లని శాస్త్ర సాంకేతిక రంగాలను ఏ కోశానా కూడా తప్పు పట్టడానికి వీలు లేదు. వాటిని ఉపయోగించుకునే విధానంలోనే పొరపాట్లు జరుగుతున్నవి. క్రికెట్ క్రీడాకారుల ,సినీ కళాకారుల వేషభాషలు కటింగు వంటి కొత్త పోకడలను యువత అనుసరించడం ఆ విధానమే చట్టబద్ధంగా మారడం అనేది ఇవాళ జరుగుతున్నటువంటి పొరపాటు. దీనిని అడ్డుకునే శక్తి తల్లిదండ్రులకు గాని, విద్యార్థి సంఘాలకు గాని, చివరికి ఉపాధ్యాయ లోకానికి గాని లేకపోవడం విచారకరం. విద్యార్థులు, ఉద్యోగ యువత, నిరుద్యోగులు,  ఉన్నత విద్యావంతులు  తాము చదువుకునే విద్యాసంస్థల్లో వినయవిధేయతలతో కాకుండా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో గడపడానికి సిద్ధపడుతున్నారు. కారణంగా ఉపాధ్యాయులు లేదా అధ్యాపకులు అంటే గౌరవించడం, మర్యాద చూపడం క్రమంగా తగ్గిపోతుంది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం అప్పులు చేసి, ఇల్లు జాగాలు అమ్మి తమ పిల్లలు బాగుపడాలని అందుకు చదువే మార్గమని గుర్తించిన తల్లిదండ్రులు ఆశించిన టువంటి లక్ష్యాన్ని పిల్లలు లేదా విద్యార్థులు గుర్తించకపోవడమే ఇక్కడ అత్యంత విచారకరం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: