టార్గెట్ పులివెందుల: సతీశ్‌ని బీటెక్ రవి దాటగలరా?

M N Amaleswara rao
పులివెందుల పేరు చెప్పగానే అందరికీ వైఎస్సార్ ఫ్యామిలీనే గుర్తొస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అలా వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు సతీశ్ రెడ్డి మాత్రమే. ఎంతమంది ప్రత్యర్ధులు వచ్చిన సరే పులివెందుల సతీశ్ రెడ్డి మాత్రం వేరు. వైఎస్సార్ ఫ్యామిలీని కంటిన్యూగా ఎదురుకున్నది సతీశ్ రెడ్డి మాత్రమే. ఓటములు వచ్చినా సరే వెనక్కి తగ్గకుండా పనిచేశారు.
అలాంటి సతీశ్ ఇప్పుడు టీడీపీలో లేరు. ఆయన ఎన్నికలు అవ్వగానే టీడీపీని వీడి రాజకీయాలకు దూరం జరిగారు. దీంతో చంద్రబాబు, బీటెక్ రవిని ఇంచార్జ్‌గా పెట్టారు. సరే బీటెక్ రవికి సతీశ్ రెడ్డి అంత ఫాలోయింగ్ ఉందా? అంటే కాస్త ఉందనే చెప్పాలి. కాకపోతే పులివెందులలో సతీశ్‌కు సెపరేట్ ఫాలోయింగ్ ఉండేది. ఎలాంటి పరిస్తితుల్లోనైనా వారు, సతీశ్ వెనుకే ఉండేవారు. అందుకే ఇక్కడ ఆయన ఎప్పుడు డిపాజిట్లు కోల్పోలేదు. కాస్త మంచిగానే ఓట్లు తెచ్చుకున్నారు.
మరి సతీశ్ ప్లేస్‌ని బీటెక్ రవి రీప్లేస్ చేయగలరా? అంటే అవుననే చెప్పొచ్చు. ఆ దిశగానే బీటెక్ రవి పనిచేస్తున్నారు. పులివెందులలో ఎలాగో జగన్‌ని ఓడించడం అనేది చాలా కష్టమైన పని. అసలు కష్టం కాదు...సాధ్యం కాదు. అలాంటప్పుడు పనిచేయకుండా లైట్ తీసుకోవచ్చు. కానీ బీటెక్ రవి అలా చేయడం లేదు. నియోజకవర్గంలో యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకునిపోతూ..నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళుతున్నారు.
ఇక త్వరలోనే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించి...ప్రతి ఒక్కరినీ కలవడమే లక్ష్యంగా బీటెక్ రవి పనిచేయనున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకు కదలనున్నారు. అయితే ఇలా పులివెందులలో టీడీపీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్న బీటెక్ రవి...వచ్చే ఎన్నికల్లో జగన్ మెజారిటీ తగ్గిస్తే చాలు...అప్పుడే రవి సక్సెస్ అయినట్లే. గత ఎన్నికల్లో జగన్‌కు 90 వేల మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీని రవి తగ్గించగలరో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: