షాకిచ్చిన తాలిబన్లు.. ఇక అంతా కన్ఫ్యూజన్?

praveen
ఇటీవలి కాలం లో తాలిబన్లు ఆయుధాలను చేతపట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఆధిపత్యాన్ని చేపట్టారు. ఏకంగా తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం పాలన సాగిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వం అమలు లోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాల తో సంబంధాలు తెగి పోయాయి అని చెప్పాలి. ఈ క్రమం  లోనే అటు ఆఫ్ఘనిస్తాన్ తో ఇతర దేశాల సంబంధాలు మెరుగు పరచడానికి పాకిస్తాన్ లాంటి దేశాలు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడిన సంక్షోభం తీర్చడానికి తీవ్ర స్థాయి  లో ప్రయత్నాలు చేస్తున్నాయ్.


 అయితే గతంలో ఖతార్  కారణం  గానే అటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటు వంటి అమెరికన్ సైనికులు వెనక్కి తీసుకు వెళ్లేందుకు చర్చల ద్వారా అమెరికా ఒప్పుకుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వెళ్లి పోవాటానికి తాలిబన్లు ఆధిపత్యం లోకి రావడానికి కారణమైన ఖాతార్ విషయం లో కూడా ఊహించని రీతిలో వ్యవహరిస్తున్నారు తాలిబన్లు అన్నది అర్ధమవుతుంది. అయితే అటు ఆఫ్ఘనిస్థాన్లో  ఉన్న ఎయిర్పోర్ట్ ల నిర్వహణకు సంబంధించిన ఒప్పందం కుదిరింది అంటూ గత కొన్ని రోజుల నుంచి ఖాతార్ టర్కీ దేశాలు  చేసుకుంటున్నాయ్. ఇదే విషయంపై అటు తాలిబన్ల ప్రభుత్వం  అందిస్తూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది.

 ఖాతార్, టర్కీ దేశాలు ఆఫ్ఘనిస్థాన్లో ఎయిర్ పోర్టుల  నిర్వహణపై ఒప్పందాలు కుదిరాయి అంటూ చేస్తున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది తాలిబన్ల ప్రభుత్వం. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి 5 ఎయిర్పోర్టుల నిర్వహణ ఖాతార్ టర్కీ కలిసి  తీసుకున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మేము  అలాంటి అనుమతులు ఎక్కడ ఇవ్వలేదు అంటూ తాలిబన్లు ఇచ్చిన స్టేట్ మెంట్  సంచలనంగా మారింది.. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబన్లలో రెండు వర్గాలు ఉండటంతోనే ఇలాంటి కన్ఫ్యూషన్  ఏర్పడింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: