తునిలో ఊహించని ట్విస్ట్: టీడీపీకి కొత్త క్యాండిడేట్?

M N Amaleswara rao
బలంగా ఉన్న అధికార వైసీపీకి చెక్ పెట్టాలంటే..టీడీపీకి ఇప్పుడున్న బలం సరిపోదనే చెప్పాలి. ఇంకా టీడీపీ బలోపేతం అవ్వాలసిన అవసరం ఉంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అలాంటి వారిని ఓడించాలంటే టీడీపీకి చాలా కష్టం. ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేసి...వైసీపీ ఎమ్మెల్యేలని డామినేట్ చేసి ప్రజల మద్ధతు దక్కించుకుంటేనే విజయం దక్కుతుంది. లేదంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా టీడీపీ పరిస్తితి ఘోరంగానే ఉంటుంది.
అయితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు టీడీపీకి చాలా కీలకం..నెక్స్ట్ గానీ గెలవకపోతే ఆ పార్టీ భవిష్యత్ ప్రమాదకరంలో పడుతుంది. పార్టీ ఉనికికే ప్రమాదం వస్తుంది. అందుకే నెక్స్ట్ ఎలాగైనా గెలవాలనే దిశగా చంద్రబాబు పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకుడు ఉండేలా చేసుకుంటున్నారు. నాయకులు బలంగా లేకపోతే వారిని తీసి పక్కనబెట్టి వేరే నాయకులకు అవకాశం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే యనమల ఫ్యామిలీ అడ్డాగా ఉన్న తుని నియోజకవర్గంలో కూడా చంద్రబాబు మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
తుని అంటే యనమల ఫ్యామిలీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1983 నుంచి 2004 వరకు యనమల రామకృష్ణుడు టీడీపీ నుంచి వరుసగా 6 సార్లు గెలిచేశారు. కానీ 2009లో యనమలకు తొలి షాక్ తగిలింది. అక్కడ నుంచి మళ్ళీ టీడీపీ కోలుకోలేదు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా సత్తా చాటుతున్నారు.
ఇప్పుడు అధికారంలో ఉండటంతో రాజా చాలా స్ట్రాంగ్‌ అయ్యారు. పైగా ఆర్ధిక బలం కూడా పెంచుకున్నారు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో రాజాకు చెక్ పెట్టడం అంత సులువు కాదు. పైగా కృష్ణుడుపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఈ సారి ఆయనకు సీటు ఇవ్వకుండా యనమల మరో సోదరుడు వెంకట్రావు కుమారుడు రాజేష్‌కు సీటు ఇవ్వాలని చందబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నాయకుడుని మార్చడం వల్ల కాస్త పరిస్తితులు మారతాయని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి తునిలో ఈ సారి టీడీపీకి ఏ మాత్రం కలిసొస్తుందో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: