అదే జరిగితే.. లాక్ డౌన్ తప్పదు?

praveen
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఓమిక్రాన్ వైరస్ అటు భారత్లో కూడా చాపకింద నీరులా పాకి పోతూనే ఉంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల కారణంగా భారత్లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతునే ఉంది. ఈ క్రమంలోనే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తూ ఉండటం గమనార్హం. అందరికి తప్పనిసరిగా వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒకరు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాస్కు ధరించాలి అంటూ సూచనలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అగ్ర రాజ్యాల తో పోల్చి చూస్తే అటు భారత్ లో ఓమిక్రాన్  వైరస్ ప్రభావం కాస్త తక్కువగానే ఉంది అని చెప్పాలి.

 ఓ వైపు అగ్ర రాజ్యాలైన బ్రిటన్ రష్యా లాంటి దేశాలు ఓమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. దీంతో కొన్ని ప్రాంతాలలో అయితే లాక్ డౌన్ విధించే పరిస్థితులు కూడా వచ్చాయి. అయితే అటు భారత్లో కూడా తక్కువ కేసులు వెలుగులోకి వచ్చినా కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నారు..  కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించడం లాంటివి కూడా చేశారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశంలో తొలి ఓమిక్రాన్ కేసు నమోదైన కర్ణాటకలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలులో కి వచ్చేసింది.

 ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో లాక్డౌన్ తప్పదు అని నిపుణులు చెబుతున్నారు. విదేశాల తరహాలోనే కేసుల సంఖ్య వేలకు చేరింది అంటే ప్రభుత్వాలు తప్పకుండా లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో  గతంలో కరోనా వ్యాప్తి చెందిన సమయంలో మొదట నైట్ కర్ఫ్యూ తో మొదలుపెట్టి కేసులు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం కఠిన అంశాలను తీసుకు వచ్చింది అన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆ దేశ రాజధాని ఢిల్లీలో కూడా క్రమక్రమంగా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన ఏడు నెలల్లో తొలిసారిగా గరిష్ఠంగా నేడు 331 కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: