గంటా సీటుపై జ‌న‌సేన క‌న్నేసిందా ?

VUYYURU SUBHASH
విశాఖపట్నం జిల్లాలో అప్పుడే రాజకీయ హడావుడి మొదలైపోయింది. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండున్నర సంవత్సరా ల టైం ఉండగానే ఎవరికి వారు హడావిడిలో మునిగితేలుతున్నారు. విశాఖ సిటీ వ‌ర‌కు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కి మంచి బలం ఉంది. 2019 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. విశాఖ సిటీ లోని నాలుగు నియోజకవర్గా ల‌లో గెలిచి తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటుకుంది. అయితే విశాఖ సౌత్ నియోజ‌క వ‌ర్గం నుంచి గెలిచిన టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు.

బెస్ట్ ఎమ్మెల్యే గణబాబు సైలెంట్ అయ్యారు. ఆయ‌న అస‌లు పార్టీలో ఉన్నారా ? అన్న సందేహం ఉంది. నార్త్‌ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గాన్ని వదిలేశారు. ఒక తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణబాబు మాత్రమే బలంగా ఉన్నారు. విశాఖ సిటీ లో జనసేన బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఈ నాలుగు నియోజకవర్గాల్లో నూ... పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక లో జనసేన పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు సిటీలో బలపడాలని జనసేన ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ నియోజకవర్గం పై జనసేన నేతలు కన్నేశారు. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన కు చెందిన ఒక మహిళా నేత కూడా అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక్కడ కాపు సామాజికవర్గం ఓటర్ల తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు.

ఒకవేళ టీడీపీతో పొత్తు ఉన్నా కూడా నార్త్ నియోజకవర్గాన్ని పొత్తు లో భాగంగా తీసుకోవాలని జనసేన నేతలు గట్టిగా డిసైడ్ అయ్యారట. మరి జనసేన నేతలు అశ‌లు ఎలా ఉన్నా ? వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: