బ్రేకింగ్ : ఆ వయసున్న పిల్లలకు అప్పటి నుంచే వ్యాక్సిన్..!

NAGARJUNA NAKKA
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 వయసున్న పిల్లల కోసం వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని ప్రధాని మోడీ అన్నారు. జనవరి 3, 2022 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్ ఒక ఆయుధం అని అన్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల తల్లిదండ్రులకు భరోసా వస్తుందన్నారు. ఇక జనవరి 10, 2022 నుంచి ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు ప్రికాషన్ డోసు ఇస్తామని చెప్పారు.
ప్రపంచంతో పాటు మన దేశంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని.. ప్రజలందరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఒమిక్రాన్ వస్తోందని ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దని.. మనసంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది అని అన్నారు. సరిపడా ఆక్సిజన్, బెడ్ లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 18లక్షల బెడ్ లు రెడీగా ఉన్నాయన్నారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందన్నారు.
ఇక కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోన్నా.. చాలామంది నిబంధనలు పాటించడంలేదు. అలాంటి వారికి ఢిల్లీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. గడిచిన 2రోజుల్లో ప్రోటోకాల్ ఉల్లంఘించిన వారి నుంచి సుమారు 1.5కోట్ల రూపాయల జరిమానాలు వసూలు చేశారు. రూల్స్ బ్రేక్ కు సంబంధించి 163ఎఫ్ఆర్ఐలు ఫైల్ అయ్యాయి. వీటిలో.. అత్యధికంగా మాస్క్ లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం, గుమిగూడిన ఘటనలే ఉన్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు దేశంలోని పలు విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపుతోంది. కర్ణాటక కోలార్ లోని శ్రీదేవరాజ్ మెడికల్ కాలేజీలో 30మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామనీ.. ఫలితాలు వస్తే ఒమిక్రాన్ ఉందా..? లేదా అని తేలుతుందని పేర్కొన్నారు. మరోవైపు ఛత్తీస్ ఘడ్, రాయ్ గఢ్ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 17మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ వచ్చింది.మొత్తానికి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యూ ఇయర్ వేడుకల్లో కరోనా నిబంధనలు తప్పక పాటించాలి.
 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: