ఇది నిజం కాకుంటే బాగుంటుంది కదా


అవును ఈ వార్త నిజం కాకుండా ఉంటే బాగుంటుంది. అనుకుంటూ భారత్ లోని చాలా మంది తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవతా వాదులు  ఇంటర్ నెట్ ను సోధిెంచారు. ఇంతకీ వారు గుడ్లప్పగించి వెతికిన వార్త ఏదో తెలుసా ?
ఐదు వందల మందితో ప్రయాణిస్తున్న నౌకలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు  యాభై మందికి పైగా సజీన దహనం అయ్యారు. ఈ ఘటన మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్ లో జరిగింది. ఆ దేశంలో ప్రవహిస్తున్న సుగంధి నదిపై ఢాకా నుంచి  బరుంగా వైపు ప్రయాణిస్తున్న నౌకలో ఈ శుక్రవారం తెల్లవారు ఝామున ఈ ఘటన జరిగిందని బంగ్లాదేశ్ లోని మీడియా సంస్థలు ప్రకటించాయి. మూడంతస్తుల పడవలో జరిగిన ఈ ప్రమాదంతో పడవలోని ప్రయాణీకులంతా ఒక్క సారిగా భయభ్రాంతులయ్యారు. మంటలు క్రమంగా వ్యాప్తి చెందడంతో చాలా మంది పడవ నుంచి నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే యత్నం చేశారు.  ప్రయాణీకుల్లో కొందరు ధైర్యంగా తమ వద్ద ఉన్న శాటిలైట్ ఫోన్ ద్వారా  బాహ్య ప్రపంచానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, నావికా సిబ్బంది, రక్షణ శాఖ సిబ్బంది హుటాహుటిన  పడవ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో దూకిన వారిని రక్షించారు. తీవ్రంగా  గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స నందిస్తున్నారు. పడవ ఇంజన్ లో మంటలు చెలరేగడంతో  పడవ లో అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అగ్నికి ఆహుతి అయిన వారి అచూకి గుర్తించడం కష్టంగా మారిందని నౌక సిబ్బ్ంది పేర్కోన్నారు. పడవలో ప్రయాణించిన వారి జాబితా,  ప్రస్తుతం ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న వారి జాబితా ను పరిశీలించాకనే ఎంత మంది చనిపోయారు, ఎంత మంది క్షతగాత్రులుగా ఉన్నారు అనే విషయం నిర్ధారణ అవుతుందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ వార్త యావత్ ప్రపంచాన్ని కలచి వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: