బెజవాడ టీడీపీలో ట్విస్ట్‌లు: ఆ సీటు జనసేనకేనా..?

VUYYURU SUBHASH
బెజవాడ తెలుగుదేశం పార్టీలో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి....గత ఎన్నికల దగ్గర నుంచి టీడీపీలో ఊహించని పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల్లోనే సీటు విషయంలో అనేక ట్విస్ట్‌లు వచ్చాయి. అప్పుడు జలీల్ ఖాన్‌...తన కుమార్తె షబానాకు సీటు దక్కిన విషయం తెలిసిందే. కానీ సీటు కోసం నాగుల్ మీరా గట్టిగా ట్రై చేశారు. చివరికి చంద్రబాబు...జలీల్ కుమార్తెకు ఇచ్చారు. అయితే ఎన్నికల్లో షబానా ఓటమి పాలయ్యారు...ఓడిపోయిన వెంటనే ఆమె విదేశాలకు వెళ్ళిపోయారు.
ఇటు జలీల్ సైతం నియోజకవర్గంలో యాక్టివ్‌గా లేరు. గత రెండున్నర ఏళ్ల నుంచి అదే పరిస్తితి. ఇక ఈ సీటు కోసం బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ తాజాగా వెస్ట్ సీటు విషయం లో చంద్రబాబు దాదాపు క్లారిటీ ఇచ్చేసేశారని చెప్పాలి. ఇంచార్జ్ పదవి ఎవరికి ఇవ్వకుండా, వెస్ట్‌కు సమన్వయకర్తగా ఎంపీ కేశినేని నానిని నియమించారు.
ఇక్కడే ఒకటి అర్ధం చేసుకోవచ్చు...ఇంచార్జ్‌ని ఎందుకు పెట్టలేదో కాస్త క్లారిటీ వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నిక ల్లో జనసేనతో గానీ పొత్తు ఉంటే..ఖచ్చితంగా ఈ సీటు ఆ పార్టీకే కేటాయిస్తారని తెలుస్తోంది. 2014లో బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు కూడా...ఆ పార్టీ కే సీటు ఇచ్చారు. నెక్స్ట్ జనసేనతో ఖచ్చితంగా పొత్తు ఉండేలా ఉంది. కాబట్టి నెక్స్ట్ వెస్ట్ సీటు జనసేనకు కేటాయిస్తారని అర్ధమవుతుంది.
అందుకే టీడీపీకి ఇంచార్జ్‌ని పెట్టకుండా...సమన్వయకర్తగా కేశినేనిని పెట్టారు. ఒకవేళ ఇంచార్జ్‌ని పెడితే చివరి నిమిషంలో టిక్కెట్ రాకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇక అన్నీ అంశాలని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు...కేశినేనికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బుద్దా వెంకన్నకు.. ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలని ఇచ్చారు. మూడు జిల్లాల పార్టీ కార్యకలాపాలు, వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను బుద్దాకు అప్పగించారు. మొత్తానికి వెస్ట్‌లో ట్విస్ట్‌లకు దాదాపు బ్రేక్ పడినట్లే అని చెప్పాలి. ఈ సీటు జనసేనకి దాదాపు ఫిక్స్ అయినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: