ఆ టీడీపీ ఫ్యామిలీల‌కు రెండు టిక్కెట్లు...!

VUYYURU SUBHASH
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అష్టకష్టాలు పడుతోంది. పార్టీలో ఇప్పటికే సీనియర్ నేతలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలను నమ్ముకుని చంద్రబాబు ఇంకా రాజకీయాలు చేస్తున్నారు. ఉదాహరణకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడో గెలుపు అన్నది మర్చిపోయిన యనమల రామకృష్ణుడు వంటి నేతలను నమ్ముకుని బాబు అదే దారిలో ముందుకు వెళుతుండటం కూడా సొంత పార్టీ నేతలకు ఎంతమాత్రం నచ్చటం లేదు.
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కొన్ని సాహ స నిర్ణ‌యాలు తీసుకోక పోతే పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప‌రిస్థితి లేదు. ఎక్కువుగా యువ‌త‌రానికి టిక్కెట్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ క్ర‌మంలోనే ఒక ఫ్యామిలీకి ఒకే టిక్కెట్టు అన్న సూత్రాన్ని కూడా బ‌బు అప్లై చేయాల‌ని అనుకుంటున్నారు. అయితే కొన్ని ఫ్యామిలీల విష‌యాల్లో మాత్రం బాబు రెండు టిక్కెట్లు త‌ప్ప‌క ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఉంది. చంద్ర‌బాబు ఫ్యామిలీకి ఎలాగూ మూడు టిక్కెట్లు ఇవ్వాలి.
ఇక అనంత‌పురం జిల్లాలోని ప‌రిటాల‌, జేసీ ఫ్యామిలీల‌కు మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు టిక్కెట్లు ఇవ్వాల్సిన ప‌రిస్థితి. ప‌రిటాల ఫ్యామిలీ నుంచి శ్రీరామ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ధ‌ర్మ‌వ‌రం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సునీత రాఫ్తాడు నుంచే పోటీ చేయనున్నారు. ఇక శ్రీరామ్ ధ‌ర్మ‌వ‌రం ఇన్ చార్జ్‌గా వ్య‌వ‌హిరిస్తున్నారు. ఇక జేసీ ఫ్యామిలీ నుంచి జేసీ త‌న‌యుడు ప‌వ‌న్ కుమార్ రెడ్డి అనంత‌పురం ఎంపీగానే పోటీ చేయ‌నున్నారు.
ఇక జేసీ ఫ్యామిలీ లో తాడిప‌త్రి నుంచి ఎవ‌రు పోటీ చేస్తారు ? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. తాడిప‌త్రి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ రెడ్డి పోటీ చేస్తారా ?  లేదా ? ఆయ‌న త‌న‌యుడు గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన అశ్మిత్ రెడ్డి పోటీ చేస్తారా ? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. ఏదేమైనా ఈ రెండు ఫ్యామిలీల‌కు మాత్రం బాబు రెండు సీట్లు ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP

సంబంధిత వార్తలు: