గాజువాకలో ట్విస్ట్‌: పల్లా పొజిషన్ ఏంటి?

M N Amaleswara rao
విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలావరకు పికప్ అయిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంఛి సిటీ టీడీపీ నాయకులు ఇప్పుడుప్పుడే పుంజుకుంటున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో మెజారిటీ నియోజకవర్గాల్లో నాయకులు స్ట్రాంగ్ అయ్యారు. జిల్లాలో 15 సీట్లు ఉంటే ఇందులో కనీసం 6 స్థానాల్లో పార్టీ పికప్ అయిందనే చెప్పాలి.
అయితే జిల్లాలో మిగిలిన స్థానాల్లో కూడా టీడీపీ పరిస్తితి కాస్త మెరుగు అవుతుందనే చెప్పాలి. ఇక అంతా బాగానే ఉంది గానీ...ఒక గాజువాకలోనే పరిస్తితి అర్ధం కావడం లేదు. అక్కడ పార్టీ పరిస్తితి ఏమన్నా బాగోలేదా? అంటే బాగుందనే చెప్పాలి. టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు గాజువాక బాధ్యతలు చూసుకుంటున్నారు. పైగా పల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో పల్లాకు నియోజకవర్గంలో మద్ధతు పెరిగింది.
దీనికి తోడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి పెద్దగా అనుకూలత కనిపించడం లేదు. రెండున్నర ఏళ్లలోనే ఆయన ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. అసలు ఇక్కడ వైసీపీకి మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే టీడీపీకి మంచి ఛాన్స్ దొరికినట్లే అని అనుకోవచ్చు..కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది..ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అయితే వచ్చే ఎన్నికలో కూడా ఆయనే ఎక్కువ పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ రావడం లేదు.  
ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి పల్లాకే డ్యామేజ్ జరుగుతుంది. అలా కాకుండా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ప్లస్ ఉంటుంది...కాకపోతే ఏకంగా పొత్తులో భాగంగా గాజువాక సీటు జనసేనకు సీటు ఇస్తే పల్లాకు సీటు గోవిందా...అంటే పల్లాకు వేరే సీటు ఇస్తారా? అనేది క్లారిటీ రావాలి. అలా కాకుండా పొత్తులో భాగంగా గాజువాక సీటు టీడీపీకి వస్తే ఇబ్బంది లేదు. లేదంటే పల్లా శ్రీనివాస్‌కు ఇబ్బందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: