రూ.3250 కోట్లకు స్కెచ్‌: హైదరాబాద్‌లో హర్షద్‌ను తలదన్నే స్కామ్‌..?

Chakravarthi Kalyan
హర్షద్ మెహతా.. స్టాక్ మార్కెట్‌ గురించి అవగాహన ఉన్న ప్రతి వారికీ తెలిసిన పేరు ఇది. స్టాక్‌ మార్కెట్‌  పని తీరు.. అప్పటి బ్యాంకుల విధానాలు.. అందులోని లోపాలను గుర్తించి వాటిని వాడుకుని కోట్లకు కోట్లు సంపాదించిన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా.. 1992లో వెలుగు చూసి ఈ స్కామ్‌ దేశాన్నే ఆశ్చర్యపరిచింది. రాజకీయ దిగ్గజాలను కలవరపరచింది. ఆర్‌బీఐ సైతం.. తన లోపాల సవరించుకునేలా చేసింది. హర్షద్ మెహతా ఉదంతం తర్వాత స్టాక్‌ మార్కెట్‌ పని తీరులోనూ.. నిబంధనల్లోనూ అనేక మార్పులు చేశారు.

అయితే.. వ్యవస్థల కన్నా మోసగాళ్లు ఎక్కువ తెలివి కలవాళ్లు అయితే.. ఈ దోపిడీలు సాగుతూనే ఉంటాయి. ఇందుకు తాజా ఉదాహరణ హైదరాబాద్ కేంద్రంగా సాగిన కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ సీఎండీ పార్థసారథి వ్యవహారం. ఈయన హర్షద్ మెహతాను తలపించేలా ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ చేశారు. తన వద్దకు వచ్చే స్టాక్ ఇన్‌వెస్టర్ల షేర్లు తమవేనంటూ కార్పొరేటు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మోసం చేశారు. ఈ పార్థసారథి అక్రమాలపై విచారణ సమయంలో  నాంపల్లి కోర్టులో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు చార్జ్ షీట్లు దాఖలు చేశారు.

ఈ పత్రాల్లో అనేక షాకింగ్ విషయాలు ఉన్నాయి. ఈ పార్థసార్థి ఎనిమిదేళ్లలో రూ.3,520 కోట్లు స్వాహా చేశారట. ఇంతకీ ఈయన ఏం చేశారో తెలుసా.. కార్వీ సంస్థలోని 2 లక్షల మంది షేర్లు తనవేనంటూ బ్యాంకులను నమ్మించాడు.. ఇండస్‌ ఇండ్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల నుంచి ఈ షేర్లు అడ్డుపెట్టుకుని 8ఏళ్ల క్రితం వందల కోట్లు రుణాలు తీసుకున్నాడు. అంతే కాదు.. ఇన్‌వెస్టర్ల  ఖాతాల్లోని రూ.720 కోట్ల క్యాష్‌ను కూడా తన సంస్థలకు మళ్లించుకున్నాడు.

అయితే.. ఇలాంటి మోసాలను ఎక్కువ కాలం మేనేజ్‌ చేయలేరు కదా.. రెండేళ్ల క్రితం కొందరు ఇన్‌వెస్టర్లు ఈ పార్థసారథి వ్యవహారంపై  సెబీకి ఫిర్యాదు చేశారు. దీంతో సెబీ కార్వీ  ట్రేడింగ్‌పై నిషేధం విధించింది. దీంతో పార్థసారథి లోన్‌లు కట్టలేకపోయాడు. ఆ బ్యాంకులు  పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అలా ఈ బండారం మొత్తం బయటికొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: