బాస్ పై కోపం.. కంపెనీని తగలబెట్టింది?

praveen
సాధారణంగా కంపెనీలో పనిచేసేఉద్యోగులు ఎప్పుడు బాస్ చెప్పిన విధంగా వింటూ ఉండాలి. అయితే కొన్నిసార్లు బాస్ ఇష్టానుసారంగా ఉద్యోగులు నడుచుకో కుండా వుంటే ఇక ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు బాస్ ఉద్యోగి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటి గొడవలు జరిగి నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు.. ఉద్యోగం మానేసి వేరే కంపెనీ లో ఉద్యోగం వెతుక్కోవడం చేస్తూ ఉంటారు.

 లేదంటే బాస్ తో గొడవ పడుతూనే అదే ఉద్యోగంలో కొనసాగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మహిళా ఉద్యోగి మాత్రం ఏకంగా బాస్ తో గొడవ జరిగింది అనే కారణంతో కక్ష పెంచుకుని ఊహించని షాక్ ఇచ్చింది. బాస్ కి ఉద్యోగికి మధ్య గడిపిన చిన్న గొడవ ఏకంగా కంపెనీ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న గొడవ కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకువచ్చింది. ఇక్కడ బాస్ తో గొడవ జరిగింది అనే కారణంతో పగ పెంచుకున్న ఆ ఉద్యోగి కంపెనీనే తగల పెట్టేసింది. ఈ ఘటన థాయిలాండ్ లో వెలుగులోకి వచ్చింది.

 థాయిలాండ్ లోని ప్రప్పాకార్న్ ఆయిల్ వేర్ హౌస్ లో పనిచేస్తూ ఉంటుంది అన్న్ శ్రీయా అనే యువతి. ఇటీవలే బాస్ తో మహిళకు గొడవ జరిగింది. అయితే ఇక బాస్ పై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకుంది సదరు మహిళ. బాస్ మీద కోపంతో చిన్న పేపర్ కు నిప్పు అంటించి ఆయిల్ కంటైనర్ల పైకి విసిరింది. దీంతో ఇక భారీగా మంటలు వ్యాపించాయి. ఇక ఆ వేర్  హౌస్ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. గమనించిన ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. దీంతో చూస్తూ చూస్తుండగానే గంటల వ్యవధిలో ఆయిల్ వేర్హౌస్  మొత్తం బూడిద అయిపోయింది. దీంతో సంస్థకు ఏకంగా9.07 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక ఆ మహిళ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: