అబ్బా జ‌గ‌న్ ఎంత ' క‌మ్మ ' గా దెబ్బ కొట్టాడో...!

VUYYURU SUBHASH
తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒకే కులం చేతిలో ఉందన్న టాక్ ఉంది. ఆ మాట‌కు వ‌స్తే తెలుగు సినిమా పరిశ్రమ ప్రధానంగా రెండు కులాల చేతుల్లోనే ఉందని... కేవలం ఐదారుగురు గుప్పిట్లోనే ఉందన్న చర్చలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇక ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమ పై కమ్మ సామాజిక వర్గం తన ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ వస్తోంది. ఇటీవ‌ల మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే.
ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో మెజార్టీ వాళ్లు అంతా కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికలకు ముందు కూడా ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు అందరూ చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ తర్వాత జగన్ ను కలిసేందుకు కూడా చాలామంది సినిమా పెద్దలు ఇష్టపడలేదు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగి... పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు స్పందించాకే... సినీ పరిశ్రమకు చెందిన కొందరు వెళ్లి ఏదో జగన్ ను నామ్ కే వాస్తే గా కలిసి వచ్చారు. ఆ తర్వాత జగన్ ఆన్ లైన్ టిక్కెట్‌, టిక్కెట్ రేట్లు త‌గ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇండస్ట్రీలో అల‌జ‌డి మొదలైంది.
ఆ త‌ర్వాత ఎంద‌రు వెళ్లి ఎన్ని సార్లు జ‌గ‌న్ ను క‌లిసినా జ‌గ‌న్ నుంచి స్పంద‌న లేదు. మ‌రో వైపు ఏపీ మంత్రి పేర్ని నాని ని కూడా దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత‌లు ప‌దే ప‌దే క‌లిసినా స్పంద‌న లేదు. చివ‌ర‌కు నిన్న అఖండ నుంచే టిక్కెట్ రేట్లు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పైగా బెనిఫిట్ షోలు వేసిన థియేట‌ర్ల‌ను కూడా సీజ్ చేశారు. దీంతో ఇప్పుడు ఇండ‌స్ట్రీకి జ‌గ‌న్ మార్క్ క‌మ్మ టి దెబ్బ త‌గిలింద‌నే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: