స్పీడ్ పెంచిన జనసేన.. వ్యూహం ఇదేనా ..!

MOHAN BABU
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న స్టీల్ ప్లాంట్ ఫైట్ లోకి పవర్ స్టార్ ఎంట్రీతో జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగిందా..? సేనాని ఎంట్రీతో కేంద్రం వెనక్కి  తగ్గుతున్న జనసైనికుల మాటల్లో నిజమెంత? ఉత్తరాంధ్రలో జనసేన కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు జనసైనికులు కసరత్తు మొదలు పెట్టినట్లే కనిపిస్తోంది. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా తనకు కలిసి వచ్చే ఉత్తరాంధ్రనే ఎంచుకునే పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు సైలెంట్ గా ఉంటూ ఇప్పుడు వైలెంట్ గా మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నిజానికి గాజువాక లో తాను పోటీ చేసిన సమయంలో అండగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉద్యమానికి మద్దతు పలకాలని ఆహ్వానించిన పవన్  అప్పట్లో పెద్దగా స్పందించలేదు. బయట నుంచి కూడా సంఘీభావం ప్రకటించలేదు. దీంతో లోకల్ జనసైనికులు కూడా కాస్త నారాజ్ అయ్యారట.

 వస్తే బాగుంటుందని పర్సనల్ గా అధినేతకు రిక్వెస్ట్ చేసిన పెద్దగా రియాక్ట్ అవ్వక పోవడంతో వీళ్లు సైలెంట్ అయ్యారన్న చర్చ జరిగింది. అలాంటిది పవన్ కళ్యాణ్ దూతగా ఉత్తరాంధ్రలో పర్యటించిన నాదెండ్ల మనోహర్ స్టీల్ ప్లాంట్ జేఏసీ మీటింగ్ లో ఉద్యమానికి పవన్ కళ్యాణ్ అండగా ఉంటారంటూ చేసిన ప్రకటన జనసేన లో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. అందుకు తగ్గట్టుగానే పవన్ పవర్ ఫుల్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయిందని చెబుతున్నారు జనసైనికులు. గత కొన్ని రోజులుగా విశాఖకు దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ బహిరంగ సభలో పాల్గొనడం క్యాడర్లో ఎక్కడ లేని ఉత్సాహన్ని నింపిందట. ఇంకో విషయం ఏమిటంటే జనసేన కార్యకర్తలకు భరోసా  కల్పిస్తూ బీమా సౌకర్యం కల్పించింది అధిష్టానం. ఇది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు బూస్ట్ లా ఉందంటున్నారు కార్యకర్తలు. ఇలాంటి సమయంలో జనసేనాని ప్రజల మధ్యకు వచ్చి పోరాటాలు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని వారంటున్నారు. లోకల్ ఎమ్మెల్యే నాగిరెడ్డి స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని అంతగా పట్టించుకోకపోవడం, అధికార పార్టీ నుంచి మద్దతు లభించకపోవడంతో యాక్టివ్ అయితే బాగుంటుందని చెబుతున్నారట. మరి జనసేనాని మదిలో ఏముందో, ఆయన ఏమనుకుంటున్నారో తెలియాలంటే ఎన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: