బాబు..ఒక దెబ్బతో అంతా పోగొట్టేశారుగా?

M N Amaleswara rao
2019 ఎన్నికలైన రెండున్నర ఏళ్ల తర్వాత...ఇప్పుడుప్పుడే ఏపీలో టీడీపీ పుంజుకుంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు. అలా అని వైసీపీ బలం ఎక్కువ తగ్గిందని కాదు...వైసీపీ బలం లైట్‌గా తగ్గుతుంటే టీడీపీ నిదానంగా పుంజుకుంటుంది. ఇటీవల మినీ మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు బట్టి చూస్తే కాస్త వాస్తవమే అని తెలుస్తోంది. వైసీపీ ఆధిక్యం దక్కించుకుంది గానీ, టీడీపీ కూడా కాస్త సత్తా చాటిందనే చెప్పొచ్చు.
అంటే ప్రజల్లో టీడీపీపై ఇప్పుడుప్పుడే నమ్మకం కుదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ అధినేతగా చంద్రబాబు ఏం చేయాలి...ఇంకా పార్టీని గాడిలో పెట్టి మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు చేయాలి. అలాగే వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలని ఇంకా ఎండగట్టాలి. అప్పుడే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వగలదు.

 
అలా కాకుండా పార్టీని ఇంకా నాశనం చేసేలాగానే టీడీపీ నేతల వైఖరి ఉంది. ఆఖరికి చంద్రబాబు కూడా అదే పనిచేస్తున్నారు. అసలు భువనేశ్వరి ఇష్యూలో ఎంత కాదు అనుకున్న వైసీపీకి నెగిటివ్ వచ్చిన మాట వాస్తవం. ఇలాంటి పరిస్తితుల్లో జాగ్రత్తగా టీడీపీ ముందుకెళ్లాలి. అలా కాకుండా టీడీపీ నేతలు..ఎన్టీఆర్‌పై పడ్డారు. భువనేశ్వరి ఇష్యూలో ఎన్టీఆర్ స్పందించిన తీరు బాగోలేదని చెప్పి వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు విమర్శించారు. ఆయన ఏదొరకంగా స్పందించారు. అది వదిలేసి పార్టీ పరంగా ముందుకెళ్లాలి. అలా కాకుండా ఎన్టీఆర్‌పై విమర్శలు చేశారు. దాని వల్ల పార్టీకే డ్యామేజ్ జరిగే పరిస్తితి వచ్చింది.
అటు చంద్రబాబు వరద బాధితులని పరామర్శించడానికి వెళ్ళి...తన భార్యని అలా అన్నారు...ఇలా అన్నారు అంటూ బాబు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అసలు వరద బాధితులని పరామర్శించడానికి వెళ్ళి బాబు...ఆ ఇష్యూ తీసుకొచ్చారు. దాని వల్ల బాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని అర్ధమైపోతుంది. అది అర్ధమైతే జనాలు...బాబుపై నెగిటివ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అదే జరిగింది. ఒక దెబ్బతో అంతా నాశనం చేసేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: