ఆఫ్ఘన్ : అంతర్జాతీయ విమానాశ్రయం.. దుబాయ్ చేతికి..!

Chandrasekhar Reddy
అమెరికా దళాలు తీవ్రవాదుల వేట కోసం వచ్చినప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్ లో అభివృద్ధికి చిహ్నంగా కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయబడింది. అయితే తాలిబన్ లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత దానిపై శ్రద్ద తరువాత దాడులే చోచుచేసుకున్న విషయం తెలిసిందే. తరువాత అది పునరుద్ధరించబడింది కానీ, ఎవరు పట్టించుకులేదు. ముందుగా అనుకున్నట్టుగా పాక్ లేదా చైనా దాని పై పెత్తనం కోసం ప్రయత్నించినప్పటికీ, పాక్ దక్కించుకుంది. అయితే అదికూడా ఎక్కువ కాలం దానిని ముందుకు తీసుకెళ్లలేకపోయింది. అందుకు కూడా తాలిబన్ లే కారణం. వాళ్ళు పాక్ అధికారులపై లేనిపోని అధికారాన్ని ప్రదర్శిస్తుండటంతో అది నచ్చని పాక్, పూర్తిగా దానిని వదిలేసి, తాలిబన్ లకు అప్పజెప్పేసింది.
పాక్ తరువాత దానిని పెద్దగా పట్టించుకున్న ఆనవాలు ఎక్కడ కనిపించలేదు. పాక్ ఆదీనంలో ఉన్నప్పుడు పెద్దగా ప్రయోజనం లేకపోయినా, ప్రస్తుత పరిస్థితి కంటే పరవాలేదు అన్నట్టే ఉంది. ప్రస్తుతం మాత్రం ఆఫ్ఘన్ వాసులనే పట్టించుకోని తాలిబన్ లు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాత్రం పట్టించుకుంటరా.. దానిని కూడా అలాగే వదిలేశారు. ప్రస్తుతం అక్కడ విదేశాల నుండి వచ్చే విమానాలు అసలు కరువైపోయాయి. ఒకటో రెండో ఎప్పుడో అది కూడా కేవలం నేతలు రాకపోకల కోసం వచ్చేవి తప్ప, విమానాశ్రయం అంతా వృధాగానే పడి ఉంటుంది.
అయితే దీనిపై దుబాయ్, ఖతార్ లాంటి దేశాలు ప్రస్తుతం ఆసక్తి చుపిస్తున్నట్టుగా తాలిబన్ లు చెపుతున్నారు. ఇప్పటికే దానికి తగిన చర్చలు ఆయా ప్రముఖుల మధ్య జరిగినట్టు తాలిబన్ లు చెప్పుకొస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న తమ వారిని లేదా ఇతర అవసరాల మేరకు ఈ తరహా వ్యూహం ఎదో పన్నినట్టే ఉంది. అయితే  పూర్తిగా విమానాశ్రయాన్ని అప్పగించడం తాలిబన్ లకు ఇష్టం ఉండదు కాబట్టి ఈ చర్చలు ఫలితాన్ని ఇస్తాయా లేదా అనేది ముందు ముందు తేలనుంది. అంతా ఎవరైనా స్వాధీనం చేసుకుంటేనే, సిబ్బంది రక్షణగా భావించి పని చేయగలరు, లేదంటే తాలిబన్ దాష్టికాలు తట్టుకుంటూ అంత విమానాశ్రయాన్ని నిర్వహించడం సాధ్యం కాని పని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: