ఢిల్లీ టూర్ కు చంద్రబాబు...?

Gullapally Rajesh
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు తెలుగు దేశం పార్టీ అనుకూల మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై అలాగే శాసనసభలో జరిగిన కొన్ని వ్యవహారాలపై ఆయన ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో అనుసరిస్తున్న వ్యవహార శైలి అలాగే రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం వచ్చిన వరదలకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అదేవిధంగా కొన్ని కీలక అంశాలకు సంబంధించి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని హోంమంత్రి అమిత్ షా అలాగే రాష్ట్రపతితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. అవసరమైతే ప్రధానమంత్రిని కూడా నన్ను కలవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే బిజెపి రాజ్యసభ ఎంపీ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు అనే సమాచారం. ఇక చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మార్పులు కూడా జరగవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రపతికి వైసీపీ ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉందని దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన ఫిర్యాదు చేయవచ్చని అంటున్నారు. అదేవిధంగా మరికొంత మంది వైసీపీ నాయకుల మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కాస్త రాజకీయాలను ఉత్కంఠగా మారుస్తున్నాయి అనే మాట వాస్తవం. చంద్రబాబుతో పాటు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అలాగే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరికొంత మంది తెలుగుదేశం నేతలు కూడా చంద్రబాబుతో పాటు ఢిల్లీ వెళ్లొచ్చాక అని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: