తైవాన్ : చైనాకు.. అమెరికా గట్టి హెచ్చరిక..!

Chandrasekhar Reddy
చైనా అధ్యక్షుడు జిన్ మరియు అమెరికా అధ్యక్షులు బైడెన్ సమావేశం కావాలని చూస్తున్నప్పటికీ కుదరటం లేదు. కారణం జిన్ దేశం వీడే పరిస్థితిలో ప్రస్తుతం లేడు. అందుకే ఈ సమావేశం విర్చువల్ గా జరగాలని నిర్ణయించడంతో, అలాగే జరిగింది. అయితే ఇందులో ఎవరి అంతర్గత విషయాలలో మరొకరు కలుగచేసుకోకూడదు అనే నియమాన్ని పెట్టుకున్నారు. దానికి ఇరువుకు ఒప్పుకున్నప్పటికీ అమెరికా మెలిక పెట్టింది. తైవాన్ విషయం అంతర్గతం కాదని, ఆయా దేశాలను ఆక్రమించడం అంతర్గతం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఆయా దేశాలతో మాట్లాడి, శాంతియుతంగా, వారి ఇష్టానికి మీ దేశంలో కలిసిపోవాలని వారు కోరుకుంటే, ఎవరి కైనా అభ్యన్తరం ఎందుకు ఉంటుందని అమెరికా ప్రశ్నించింది. అలా కానీ పక్షంలో ఆ దేశం సాయం అడిగినప్పుడు అండగా ఉండటం తప్పనిసరి అని కూడా స్పష్టం చేసింది.
శాంతియుతంగా జీవిస్తున్న ఒక దేశంపై దురాక్రమణలకు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి మాత్రం లేదని అమెరికా ఈ చర్చలలో చైనాకు స్పష్టం చేసింది. ఈ సమావేశం భారీఎత్తున జరపాలని భావించినప్పటికీ అలా జరగకపోవడంతో రెండు దేశాల మధ్య చెడిందని భావించారు. కానీ విర్చువల్ గా జరగటంతో అందరికి స్పష్టత వచ్చింది. తైవాన్ పై ఎటువంటి దాడులకు తెగబడినా తాము కలిగించుకొంటామని అమెరికా స్పష్టం చేసింది. సరిహద్దు సమస్యలు లాంటివి ఉంటె వాటిని చర్చించుకొని పరిష్కరించుకోవాలి తప్ప దురాక్రమణలకు పాల్పడే ఆలోచనలు మానుకోవాలని సూచించింది.
ఒక దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అధికార దాహానికి ఆహుతి చేయడం అంతర్జాతీయ సమాజం ఒప్పుకునే స్థితిలో లేదని ఈ చర్చలలో అమెరికా తన అభిప్రాయాన్ని చైనాకు సుస్పష్టంగా తెలియజేసింది. తైవాన్ పై యుద్దరూపేణ లేదా వాణిజ్య రూపేణా లేదా  మరో రకంగా చైనా ఒత్తిడి తెస్తే మాత్రం అమెరికా కలగజేసుకుంటుందని, దానిలో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పేసింది. దానికి చైనా సమాధానం ఏమైనప్పటికి, అంతర్జాతీయ సమాజంలో ఆ దేశం ఒంటరి అయిపోయిందనేది కూడా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: