రాజమండ్రి వైసీపీలో కన్ఫ్యూజన్...బరిలో దిగేది ఎవరు?

M N Amaleswara rao
ఏపీలో ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడా లేకుండా...అన్నీ జిల్లాల్లో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇలా అన్నిచోట్ల బలంగా ఉన్న వైసీపీ...కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కొద్దిగా బలం లేదనే చెప్పాలి. అధికారంలో ఉన్నా సరే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్తితి మెరుగు అవ్వడం లేదు. అలా వైసీపీ పరిస్తితి సరిగ్గా లేని నియోజకవర్గాలు వచ్చి రాజమండ్రి సిటీ, రూరల్ స్థానాలు.
ఈ రెండు స్థానాలు టీడీపీకి కంచుకోటలు అనే చెప్పాలి. గత ఎన్నికల్లో సిటీలో ఆదిరెడ్డి భవాని దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇటు రూరల్‌లో బుచ్చయ్య చౌదరీ కూడా మంచి మెజారిటీతో గెలిచారు. ఇప్పటికీ ఆ రెండు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు బలంగానే ఉన్నారు. కానీ వైసీపీనే కాస్త వీక్‌గా ఉంది. వీక్‌గా ఉండటమే కాదు..అసలు రెండు చోట్ల వైసీపీకి సరైన నాయకులు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు నేతలని మార్చుకుంటూ వచ్చేస్తున్నారు. దీని వల్ల వైసీపీకి నష్టమే జరుగుతుంది తప్ప, లాభం లేదు. అందుకే రెండు చోట్ల వైసీపీ పుంజుకోలేదు.
గత ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుంచి రౌతు సూర్యప్రకాశ్ రావు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆయన్ని పక్కనబెట్టి శిఖాకొల్లు సుబ్రహ్మణ్యంకు బాధ్యతలు అప్పగించారు. ఆయన కొన్ని రోజులు పనిచేశాక, పార్టీలోకి వచ్చిన ఆకుల సత్యనారాయణకు సిటీ కొ ఆర్డినేటర్ పదవి ఇచ్చారు. ఆయన ఇప్పుడు పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు.
అటు రూరల్‌లో వైసీపీ తరుపున ఆకుల వీర్రాజు పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ మధ్య వీర్రాజుని కూడా పక్కనబెట్టి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన చందన నాగేశ్వర్‌కు పదవి ఇచ్చారు. ఆయన వల్ల కూడా రూరల్‌లో వైసీపీకి ఒరింగింది లేదు. అసలు ఇలా నేతలని మార్చుకుంటూ వెళ్ళడంలో పార్టీకి ఉపయోగం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో సిటీ, రూరల్ నియోజకవర్గాల నుంచి ఎవరు బరిలో దిగుతారో క్లారిటీ లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: