కేశినేని ఇలా షాక్ ఇస్తాడ‌ని వారు ఊహించ‌లేదా...!

VUYYURU SUBHASH
తెలుగు దేశం పార్టీకి చెందిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని రాజ‌కీయం మ‌ళ్లీ మారుతోంది. కొద్ది రోజులు గా ఆయ‌న పార్టీ తీరుపై తీవ్ర అస‌హ‌నంతో ఉంటూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌న్న టాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న బీజేపీ లోకి వెళ్లి పోతారంటూ కూడా పుకార్లు వ‌చ్చాయి. అయితే ఇటీవ‌ల ప‌రిణామాలు చూస్తుంటే ఆయ‌న మ‌న‌సు మార్చుకుని ... వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారా ? అంటే అవుననే అంటున్నారు నాని స‌న్నిహితులు.
కొద్ది రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తోన్న కేశినేని నాని ఇప్పుడు తిరిగి యాక్టివ్ కావడంతో పార్టీలో ఆయన ప్రత్యర్థులు కాస్త కోమాలోకే వెళ్లి పోయార‌ని అంటున్నారు. నాని క‌రెక్టు టైం లోనే త‌న సొంత పార్టీలోని ప్ర‌త్య‌ర్థుల‌కు స‌రైన షాక్ ఇచ్చార‌ని అంటున్నారు. బెజ‌వాడ రాజ‌కీయాల్లో కొద్ది రోజులుగా ఎంపీ నాని వ‌ర్సెస్ ఆ పార్టీ నేత‌లు బొండా ఉమా, బుద్ధా వెంక‌న్న‌, షేక్ నాగుల్ మీరా అన్న‌ట్టుగా కొన‌సాగాయి.
కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో నాని దూకుడు తో పై ముగ్గురు నేత‌లు ఫైర్ అయ్యారు. అయినా నాని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ తన కుమార్తె కేశినేని శ్వేత ను మేయర్ అభ్యర్థిగా ప్రకటింప చేసుకున్నారు. అయితే అదే స‌మ‌యంలో  బుద్దా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా నానిని టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌ర్వాత నాని సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవ‌ల చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు ఆ ప‌ర్య‌ట న‌ను నాని అంతా తానై చూసు కున్నారు.
ఇక ఇప్పుడు చంద్ర‌బాబు మ‌ళ్లీ ఆయ‌న కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. దీంతో నిన్న‌టి వ‌ర‌కు నాని  ని టార్గెట్ గా చేసుకున్న బెజ‌వాడ పార్టీ నేత‌లు ఇప్పుడు ఆయన దూకుడుతో షాక్ అవుతున్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: