జగన్ టార్గెట్గా ఢిల్లీకి చంద్రబాబు ?

Santhi Kala
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు పుష్కలం గా కనబడుతున్నాయి. ఎన్నికల సంఘం వద్దకు చంద్రబాబు నాయుడు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పలు ఫిర్యాదులు చేసేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కి వెళ్లడానికి ఇప్పటికే కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కూడా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు రాజకీయవర్గాలలో వినిపిస్తున్నాయి. టీడీపీ కీలక నేతలు కూడా చంద్రబాబుతో పాటు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని కొంతమంది కేంద్ర మంత్రులతో పాటు గా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అలాగే కేంద్ర హోం మంత్రిని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
దాదాపుగా నెల రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అలాగే కేంద్ర హోంమంత్రిని కలిసే అవకాశం ఉంది అని ప్రచారం జరిగినా సరే నిజం కాదని తర్వాత అర్థమైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు తెలుగుదేశం పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వద్దకు చంద్రబాబు వెళ్లే అవకాశం ఉందని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం పెద్దలకు వివరించడానికి ఆయన సిద్ధమవుతున్నారని అంటున్నారు.
రాజకీయంగా ఈ పరిస్థితుల్లో ఏ మలుపు జరగబోతున్నాయి ఏంటనే దానిపై ఇపుడు టీడీపీ వర్గాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. టిడిపి లో ఉన్న కొంతమంది నాయకులుకూడా చంద్రబాబుపై ఈ మేరకు ఒత్తిడి కూడా తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఢిల్లీకి వెళ్తారని దానిపై క్లారిటీ లేకపోయినా కేంద్ర హోంమంత్రి వద్ద అపాయింట్ మెంట్ విషయంలో రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తీవ్రంగా కష్టపడుతున్నారని సమాచారం. అలాగే బిజెపి రాజ్యసభ ఎంపీ ఒకరు చంద్రబాబునాయుడు కోసం అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తో పాటుగా యనమల రామకృష్ణుడు అలాగే పయ్యావుల కేశవ్ ఢిల్లీ వెళ్లే అవకాశముంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: