ఈఎంఐ ఆఫర్లో విమాన టికెట్.. త్వరపడండి?

praveen
ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలి అని ప్రతి సామాన్యుడు కోరుకుంటూ ఉంటాడు.. ఇక జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాలనే కోరికతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. లోకల్ ప్రయాణాల వరకు ఓకే కానీ  ఇక విమానాల్లో దూర ప్రయాణాలు చేయాలంటే  భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక అలాంటి ఖర్చు అంటే సామాన్యుడికి ఎంతో కష్టం.. దీంతో విమానంలో ప్రయాణాలు చేయాలి అని కలలు కనడం మానేసి తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి సామాన్యుడి అలాంటి కలలు కనొచ్చు కలలు నెరవేర్చుకోవచ్చు. సామాన్యుడి కలల్ని నెరవేర్చేందుకు అప్పుడప్పుడూ విమానయాన సంస్థలు పలు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి.

 తక్కువ ధరకే విమాన టికెట్లను అందించడం చేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం షాప్ లో ఏదైనా ఫోన్ కొనుక్కొని ఇక ఈఎమ్ఐ లో డబ్బులు కట్టినట్లు గానే అటు విమాన టికెట్ కూడా కొనుక్కుని ఈఎంఐ రూపంలో నెలవారీగా డబ్బులు  కట్టే అవకాశం ఉంటే ఎంత బాగుండు అని ప్రతి ఒక్కరు కోరుకునే ఉంటారు. అయితే ఇక ఇది ఇప్పుడు నిజం కాబోతుంది. ముందుగా విమానం టికెట్ కొనండి తర్వాత ప్రయాణం చేయండి.. ఆ తర్వాత ఈఎంఐ రూపంలో డబ్బులు కట్టుకోవచ్చు. ఇలా సులభ వాయిదా లో అటు కల నిజం చేసుకుని ఎంతో సులభంగా డబ్బులు కూడా కట్టొచ్చు.

 ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజలు అందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఈ గుడ్ న్యూస్ అందరి కోసం సిద్ధం చేస్తుంది. విమాన టిక్కెట్ ధరను ఈఎంఐ రూపంలో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ప్రారంభ ఆఫర్లో భాగంగా వడ్డీ లేకుండా మూడు నెలలపాటు ఈఎంఐ రూపంలో విమాన టిక్కెట్ ధరను కట్టుకోవచ్చు. ఇక వడ్డీతో కలిపి ఆరు నెలలు, 12 నెలలు వాయిదాల్లో చెల్లింపులు చేసుకోవచ్చు అంటూ ఇటీవల స్పైస్జెట్ ప్రకటించింది. దీనికోసం ప్రయాణికులు ముందుగా పాన్, ఆధార్ కార్డు, వన్ టైం పాస్ వర్డ్ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.  యూపీఐ ఐడి తో ఈఎంఐ చెల్లించవచ్చు. దీనికి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు వివరాలు అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: