ఆ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్య‌కు 2024లో నో టిక్కెట్‌...!

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు మ‌రో రెండున్న‌రేళ్ల టైం ఉన్నా కూడా.. ఎన్నిక‌ల‌ వాతావరణం ఇప్పటి నుంచే కన్పిస్తుంది. పోటీ చేయాలనుకుంటున్న నేతలు జనంలోకి వస్తూ ఏదో ఒక కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. ఇక ఏపీ లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని ఇప్ప‌టి నుంచే విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తోంది. ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా చంద్ర‌బాబు మాత్రం ఈ వ‌య‌స్సు లో కూడా ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌సే న బలంగా ఉన్న ప్రాంతాల‌పై ఇప్ప‌టి నుంచే లెక్క‌లు వేసుకుంటూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ తో పొత్తు పెట్టుకుంటే వ‌చ్చే లాభ న‌ష్టాల‌పై కూడా లెక్క‌లు వేసుకుంటున్నారు.
ఈ క్ర‌మంలోనే చాలా మంది పార్టీ నేత‌లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో  జ‌న‌సేన తో పొత్తు పెట్టు కోవాల‌ని సూచ‌న‌లు చేస్తున్నారు. జ‌న‌సేన తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి 20 ఎమ్మె ల్యే,  4 వ‌ర‌కు ఎంపీ సీట్లు ఇస్తే మ‌నం వైసీపీని స‌లువుగా ఓడించి అధికారంలోకి వ‌స్తామ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. ఒక  వేళ జ‌న‌సేన తో నిజంగా పొత్తు కుదిరితే కొంద‌రు టీడీపీ నేత‌లు త‌మ సీట్లు వ‌దులు కోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. అప్పుడు పార్టీ లో కొంద‌రు సీనియ‌ర్లు మాత్ర‌మే కాకుండా.. సిట్టింగ్ ఎమ్మెల్యే లు సైతం త‌మ సీట్లు వ‌దులు కోక త‌ప్ప‌ని ప‌రిస్థితి.
ఈ లిస్టులోనే రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య  చౌద‌రి సైతం త‌న సీటు త్యాగం చేయ‌క  త‌ప్ప‌ద‌ని అంటున్నారు. బుచ్చయ్య చౌదరి రాజమండ్రి అర్బన్ - రాజ‌మండ్రి రూరల్ నియోజకవర్గాల నుంచి మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ జనసేన తో పొత్తు  ఉంటే రూర‌ల్ సీటు జ‌న‌సేన‌కే వెళుతుంద‌ని అంటున్నారు. అప్పుడు అక్క‌డ జ‌న‌సేన లో బ‌ల‌మైన నేత‌గా ఉన్న  కందుల దుర్గేష్ కే సీటు ఇస్తార‌ని టాక్ ? అప్పుడు బుచ్చ‌య్య త‌న సీటు త్యాగం చేయ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: