బెజవాడ తమ్ముళ్ళు ఇలా ఉన్నారేంటి? భలే గేమ్ ఆడుతున్నారే?

M N Amaleswara rao
మొదట నుంచి విజయవాడ(బెజవాడ) తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. నాయకుల మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌లో ఉంది. 2019 ఎన్నికల ముందు నుంచే బెజవాడలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ అంతకముందు అధికారంలో ఉండటం వల్ల టీడీపీలో గ్రూప్ తగాదాలు బయటపడలేదు. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటినుంచే రచ్చ మొదలైంది.
ఆ రచ్చ వల్లే...బెజవాడలో కీలకంగా ఉన్న దేవినేని అవినాష్ టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పటికీ బెజవాడలో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఆ ఆధిపత్య పోరు వల్లే కాదు...విజయవాడ కార్పొరేషన్‌లో కూడా టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది. అయినా సరే తమ్ముళ్ళు మారడం లేదు...ఇంకా అదే పనిలో ఉన్నారు. అయితే ఈ మధ్య ఏంటో తమ్ముళ్ళు కాస్త వెరైటీగా రాజకీయం చేస్తున్నారు. రాజకీయంగా గేమ్ ఆడుతున్నారా? లేక అలాగే ఉండాలని అనుకుంటున్నారో? తెలియదు గానీ ఒక నాయకుడు కూడా లైన్‌లో పనిచేయడం లేదు.
ఒకసారి ఒక గ్రూప్ బెజవాడలో యాక్టివ్‌గా పాలిటిక్స్ చేస్తే..మరొకసారి మరో గ్రూప్ యాక్టివ్‌గా పాలిటిక్స్ చేస్తుంది. గత కొంతకాలంగా బెజవాడ తమ్ముళ్ళు ఇలాగే చేస్తున్నారు. ఇటీవల బుద్దా వెంకన్న వర్గం బాగా హడావిడి చేసింది... అప్పుడు కేశినేని వర్గం అడ్రెస్ లేదు. పైగా కేశినేని ఆఫీసులో చిన్న చిన్న మార్పులు జరగడంతో, ఆయన పార్టీ మారిపోతున్నారని, ఇంకేముంది..ఆయన బీజేపీలోకి జంప్ చేసేస్తున్నారని ప్రచారం వచ్చింది.

 
అదిగో ఢిల్లీలోనే ఉండి కేంద్ర పెద్దలతో చర్చలు చేస్తున్నారని టాక్ వచ్చేసింది. తీరా చూస్తే...వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసుపై దాడికి నిరసనగా చంద్రబాబు ఆఫీసులో 36 గంటల దీక్ష చేశారు. ఆ దీక్షలో కేశినేని ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుతో మాట్లాడారు...నెక్స్ట్ బాబుతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో వైసీపీకి ధీటుగా ముందుకెళుతున్నారు. ఇటు విజయవాడలో కూడా గద్దె రామ్మోహన్‌తో కలిసి యాక్టివ్ గా తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు బుద్దా వెంకన్న వర్గం కనబడటం లేదు. మొత్తానికి తమ్ముళ్ళు బాగా గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: