`పెట్రో మంట‌ల‌`పై సామాన్యుడి ఆలోచ‌న ఆవిష్క‌రించిన ITDP బాలానందం

VUYYURU SUBHASH
దేశాన్ని ప‌ట్టికుదిపేస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు. వాస్త‌వానికి ఇతర వ‌స్తువుల ధ‌ర‌ల‌నే కాదు... దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల ఏకైక శ‌క్తి వీటికే ఉంది. ఎందుకంటే.. ఒక వ‌స్తువు.. ఉత్ప‌త్తి స్థానం నుంచి వినియోగ‌దారునికి చేర‌డానికి ర‌వాణానే సాధానం. ఈ ర‌వాణా వ్య‌వ‌స్థ పూర్తిగా.. చ‌మురుపైనే ఆధార‌ప‌డింది. దీంతో చ‌మురు ధ‌ర‌లు పెరిగితే.. ఖ‌చ్చితంగా ఆప్ర‌భావం వ‌స్తువుల‌పైనా.. వినిమియంపైనా.. క‌డ‌కు .. సామాన్యుల ఆర్థిక ప‌రిస్థితిపైనా ప‌డుతుంది. అందుకే గ‌తంలో పెట్రోలు, డీజిల్  ధ‌ర‌ల‌ను పెంచాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. ఆచి తూచి అడుగులు వేసేవారు.

అయితే.. రాను రాను.. ప్ర‌భుత్వాలు ఆదాయాల‌ను పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్న క్ర‌మంలో సామాన్యుల ఆర్థిక ప‌రిస్థితిని ఎక్క‌డా ప‌ట్టించుకోవ‌డం లేదు. ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత నుంచి అంద‌రూ.. ఆర్థికంగా స‌త‌మ‌తం అవుతున్నారు. దేశంలో ఇప్పుడు 110 రూపాయ‌ల‌కు త‌క్కువ కాకుండా.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ప‌లుకుతున్నాయి. దీంతో సాధార‌ణ ప్ర‌జ‌లు స‌త‌మ‌తం అవుతున్నారు. కానీ, ప్ర‌భుత్వాలు మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉంటున్నాయి.

అయితే.. ఇదే విష‌యంపై తాజాగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు.. ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెస‌ర్ భ‌ర‌త్ ఝ‌న్‌ఝ‌న్ వాలా రాసిన పెట్రో మంట‌లు మంచివే ఆర్టిక‌ల్‌లో పెట్రో ధ‌ర‌లు పెర‌గ‌డాన్ని ఆయ‌న స‌మ‌ర్థించారు. అయితే.. దీనికి టీడీపీ ఐటీ విభాగం.. రాష్ట్ర ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ.. బాలానందం సామాన్యుల కోణంలో దీనిని విశ్లేషిం చారు.  ముఖ్యంగా అన్ని వ‌స్తువుల ధ‌ర‌ల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చిన ప్ర‌భుత్వాలు.. ఒక్క పెట్రోల్ ధ‌ర‌ల‌ను మాత్రం ఎందుకు విస్మ‌రిస్తున్నాయ‌నే కోణంలో బాలానందం ప్ర‌శ్నించిన తీరుకు నెటిజ‌న్లు జేజేలు ప‌లుకుతున్నారు. సామాన్యుడి బాధ‌ను బాలానందం చ‌క్క‌గా ఆవిష్క‌రించారంటూ.. లైకులు కొడుతున్నారు.

నిజానికి పెట్రో ధ‌ర‌ల‌పై ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటే.. ప్ర‌భుత్వాలు మాత్రం మౌనంగా ఉండ‌డ‌మే కాకుండా స్థానికంగా ప‌న్నులు విధిస్తూ.. ప్ర‌జ‌ల ఆదాయాన్ని పిండుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను ఎలా స‌మ‌ర్ధిస్తారంటూ.. ఝ‌న్ ఝ‌న్ వాలాను వారు కూడా ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఏదేమైనా.. బాలానందం విశ్లేష‌ణ‌... సామాన్యుల కోణంలో ఉన్న‌ ఆయ‌న ఆలోచ‌నా విధానం .. మ‌రీ ముఖ్యంగా.. రైతుల‌ను దృష్టిలో పెట్టుకుని వారిక‌ష్ట‌న‌ష్టాల‌ను ఆవిష్క‌రించిన తీరు కూడా అద్భుత‌మ‌ని అంటున్నారు నెటిజ‌న్లు.    

బాలానందం పోస్టు య‌ధావిధిగా...
అందరికి నమస్కారం...
ఆంధ్రజ్యోతిలో ప్రముఖ ఆర్థికవేత్త మరియు బెంగుళూరు ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్ భరత్ ఘన్ ఘన్ వాలా…
పెట్రో మంటలు మంచివే అని రాసిన క‌థ‌నంపై నా విశ్లేష‌ణ‌:

ఆయన రాసిన వ్యాసం చాలా బాగుంది ఒక సామాన్యుడిగా నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి..
నేను ఆయనంత చదువుకోలేదు ఆయనని విమర్శించేస్థాయి నాకు లేదు...

కొన్ని ప్రశ్నలు మాత్రమే....
భరత్ ఘన్ ఘన్ వాలా  పెట్రో ధరలు పెరగటం దేశా ఆర్ధికానికి మంచిదే మనం కొన్న రేటుకి అమ్ముతున్నాము దాని వలన ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది అన్నారు.
*సరే కొనే రేటుకే అమ్ముతున్నారు అనుకుందాం మరి దానిమీద అనేక రకాల టాక్సులు దేశము మరియు రాష్ట్రాలు వేసి రెట్టింపు ధరకు అమ్ముతున్నారు ఇది సమంజసమా. దీనిని జిఎస్టి పరిధిలోకి ఎందుకు తేలేదు... దీనిని ఆదాయ వనరుగా చూస్తున్నది నిజమా కాదా... దీని వలన సామాన్యుడు కుదేలవుతున్నాడా లేదా...

*గత ఏడెళ్ళలో పెట్రోలు ధరలు అంతర్ జాతీయం తగ్గాయి అవి ఈ మధ్యన అంటే గత సంవత్సర కాలంగా అవి పెరిగాయి...
పెట్రో ధరలు తగ్గినపుడూ దేశంలో ఎందుకు అధిక ధరలకు అమ్మారు...అంటే దీనిని వ్యాపార వస్తువుగా ఆదాయ వనరుగా చూస్తున్నరనేది వాస్తవమా కాదా...దీని వలన ఎవరికి మేలు..రాష్ట్ర మరియు దేశ ఆదాయాలకి మరియు ప్రైవేటు సంస్థలకి తప్ప.

*పెట్రో ధరలు పెరగడం వలన ఉత్పత్తి రంగాల మీద భారం పడుతుంది అది తిరిగి కొనుగోలుచేసే ప్రజలమీద పడుతుంది. అది మీకు తెలియనది కాదు. ఉదాహరణకు వ్యవసాయం తీసుకుందాం...దమ్ము ఎరువులు కూలీల ఖర్చు పెరుగుతుంది...కాని వ్యవసాయ ఉత్పత్తుల ధరలకి సీలింగ్ ఉంటుంది దాని వలన రైతుకి అదనపు భారం...అతనికి నష్టం...ఈ నష్టం ఎవరు భరిస్తారు. ఇలా రైతే కాదు ఇవి పెరగడం వలన అన్ని రంగాలపై పడి అది సామాన్యుడికి భారమై ఉంటుంది.. సామాన్యుడుకి ఆదాయ వనరులు పెరగలేదు..దీని వలన సామాన్యుడికి కొనుగోలు శక్తి నశిస్తుంది. అది అంతిమంగా దేనికి చేటు. ఇవి ఎందుకు అలోచించలేదు.

*ఇక ఆఖరుగా 1947 లో మనకి స్వాతంత్ర్యం రాగా అంటే సుమారు 75 సంవత్సరాలకి 68 సంవత్సరాలు బిజెపి ఏతర పార్టీలు పరిపాలన చేసాయి. ఈ 68 సంవత్సరాలలో పెట్ఱోలు రేటు సుమారు 60 రూపాయలు. ఈ  60 రూపాయలు కావడానికి 68 సంవత్సరాలు పట్టింది...కాని ఈరోజుకి అంటే సుమారు ఏడున్నర సంవత్సరాలకి దాదాపు 50 రూపాయలు పెరిగింది అంటే ఇరోజు సుమారు రేటు 111 రూపాలు.. ఇది డేశానికి ఏరకంగా మంచిదో నాకు అర్ధం కాలేదు... నేనేమి విమర్శ చేయట్లేదు..ఆయనను విమర్శించే స్థాయి అంత చదువు నాకు లేదు..కాని ఇది సామాన్యుని ఆలోచన..

టీం ఐ టిడిపి
బాలానందం ఉండవల్లి
ఐటిడిపి రాష్ట్ర  కార్యనిర్వాహక కార్యదర్శి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: