ఆఫ్ఘన్ లోనే.. అమెరికావాళ్లు.. !

Chandrasekhar Reddy
ఇరవై ఏండ్ల పోరాటం అనంతరం అమెరికా ఆఫ్ఘన్ వదిలి వెళ్ళింది. అయితే అక్కడే ఇరవై ఏళ్ళు అంటే అక్కడ కనీసం సైనికుల కుటుంబాలు వెళ్లి ఉండాల్సి ఉండొచ్చు, ఇతర సహాయకులు కూడా వెళ్లి ఉండాల్సి ఉంటుంది. అలా ఉన్న వారిని తాలిబన్ లు ఆక్రమించిన వెంటనే దాదాపుగా తరలించింది అమెరికా. అయినా కొందరు ఇంకా అక్కడే ఉన్నారని తాజాగా వెల్లడిస్తుంది. దాదాపు ఇంకా అక్కడే 450 మంది అమెరికన్ లు ఉన్నారని పెంటగాన్ అంచనా కు వచ్చింది. అయితే ఇటీవల అమెరికా తాలిబన్ లతో చర్చలకు వెళ్ళినప్పుడు వారిని చూపెట్టి భయపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఖతార్ లో ఉన్న వాళ్ళను చూసి ఏదైనా నిర్ణయం తీసుకోండి అని తాలిబన్ లు కూడా బెదిరించి తమ డిమాండ్లను ఒప్పుకోవాలని ప్రయత్నించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆఫ్ఘన్ లో చిక్కుకుపోయిన కొందరి అమెరికన్ లతో పెంటగాన్ అధికారులు సంప్రదింపులు జరపగా, వాళ్ళు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే వీరిలో తిరిగి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నది 176 మంది మాత్రమే. మిగిలిన వారు రావడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. అయితే ఈ రెండు వందల మంది అక్కడే ఉన్నారా లేక ఏ సరిహద్దయినా దాటి వెళ్ళారా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. బైడెన్ ప్రభుత్వం మాత్రం 200 మందికి మించి ఆఫ్ఘన్ లో అమెరికన్ లు లేరని స్పష్టం చేస్తుంది. అక్కడ నుండి వచ్చేసిన తరువాత మళ్ళీ తాలిబన్ లతో ప్రత్యక్ష చర్చలు చేయలేదని, తాజాగా జరిగిన చర్చలలో కూడా తాము పాల్గొనలేదని అమెరికా అంటుంది. అయితే ఉన్న కొద్ది మందిని పాక్, ఇరాన్, ఖతార్ దేశాల సాయంతో తమదేశానికి తెచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు అంటున్నారు.
తనపై దాడి జరగగానే అమెరికా ఆఫ్ఘన్ లో అడుగుపెట్టింది. అక్కడ అణువణువునా తీవ్రవాదుల కోసం వెతికింది, కానీ వాళ్ళందరూ పాక్ లో ఐఎస్ స్థావరాలలో దాక్కుని 20 ఏండ్లు బ్రతికేశారు. అది తెలిసిన అమెరికా ఇంక ఉండి దండగ అనుకుని, ఆఫ్ఘన్ నుండి నిష్క్రమించింది. అంతటితో తాలిబన్ లు ఆశ్చర్యంగా ఆఫ్ఘన్ ను ఆక్రమించేశారు. దీనివెనుక రష్యా ఆయుధ సరఫరా, చైనా, పాక్ మద్దతు ఉన్నట్టు అనంతరం ప్రపంచానికి తెలియవచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: