చంద్రబాబు వల్లే దాడి జరిగింది: టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

Sahithya
నేడు ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది. నిన్న సాయంత్రం టీడీపీ ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడిని నిరసిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బంద్ కు పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర నాయకులు అందరిని ఇళ్ళ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకుల ఇళ్ళ వద్ద భారీగా నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు మొహరించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసానికి చేరుకున్న పోలీసులు... ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
పోలీసులు పై నమ్మకం పోవడంతో ... మా రక్షణ మేమే చూసుకుంటామన్న బుద్దా వెంకన్న... పోలీసుల తీరుని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీలో పోలీసు వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం పోయింది అని అన్నారు. డిజిపి నే...‌వైసిపి కార్యనిర్వాహక అధ్యక్షులు గా పని చేస్తున్నారు అని విమర్శలు చేసారు. ఆయన ఆదేశాలతో పోలీసులు కూడా వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు అని విమర్శలు గుప్పించారు. నిజాయితీ గల అధికారులు కూడా డిజిపి వల్ల ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు.
టీడీపీ హయాంలో పోలీసు వ్యవస్థ కు ఎంతో గౌరవం ఉండేది అని అన్నారు ఆయన. ఇప్పుడు మాకు పోలీసు ల పై నమ్మకం లేదు అన్నారు. మాకు మేమే రక్షణ గా .. నిలబడి.. వైసిపి రౌడీ మూకలను అడ్డుకుని తీరతాం అని దాడికి దాడే సమాధానం అని మేము కూడా నిర్ణయించుకున్నాం అని ఆయన అన్నారు. చంద్రబాబు గాంధీజీ సిద్దాంతాల వల్ల వైసిపి వాళ్లు రెచ్చిపోతున్నారు అని చంద్రబాబు ఫోన్ చేస్తే డిజిపి కి స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి అని ఆయన పేర్కొన్నారు. ఏపీ లో ఆర్ధిక ఎమర్జెన్సీ నెలకొంది అని వ్యాఖ్యలు చేసారు. దృష్టి మళ్లించడానికే ఈ వరుస దాడులు అన్నారు బుద్దా వెంకన్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: