ఆదిరెడ్డి భ‌వానీ, బుచ్చ‌య్య‌కు 2024లో నో టిక్కెట్‌... !

VUYYURU SUBHASH
ఏపీలో గ‌త ఎన్నిక‌ల‌లో టీడీపీ చిత్తు చిత్తు గా ఓడిపోయింది. ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం 23 సీట్లు మ‌త్ర‌మే వ‌చ్చాయి. అయితే రాజ‌మండ్రి సిటీ, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గా ల‌లో మాత్రం ఆదిరెడ్డి భ‌వానీ, సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ య్య చౌద‌రి బంప‌ర్ మెజార్టీ ల‌తో విజ‌యాలు సాధించారు. సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆదిరెడ్డి భ‌వానీ ఏకంగా 32 వేల ఓట్ల భారీ మెజార్టీ తో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఇక రూర‌ల్ నుంచి 12 వేల ఓట్ల మెజార్టీ తో గెలిచిన బుచ్చ‌య్య ఆరో సారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఈ ఇద్ద‌రికి సీట్లు ఉండ‌వ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది వాస్త‌వం అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. సిటీ లో గ‌త ఎన్నిక‌ల్లోనే భ‌వానీ భ‌ర్త ఆదిరెడ్డి వాసుకు సీటు ఇవ్వాల‌ని అనుకున్నారు. అయితే భ‌వానీ దివంగ‌త ఎర్ర‌న్న కుమార్తె కావ‌డంతో మ‌హిళా కోటాలో ఆమెను రంగంలోకి దింపారు. వ‌చ్చే ఎన్నిక ల‌లో మాత్రం ఆదిరెడ్డి వాసుకే సీటు ఖ‌రారు అయ్యింద‌ని టాక్ ?  ఇక వాసు ఇప్ప‌టికే రాజ‌మండ్రి సిటీలో పూర్తి స్థాయిలో గ్రిప్ తెచ్చుకుంటున్నారు.

ఇక బుచ్చ‌య్య వ‌ర్గంతో గ్యాప్ లేకుండా ఉండేందుకు  బుచ్చ‌య్య సోద‌రుడి కుమారుడికి మేయ‌ర్ ఇచ్చే విష‌యంలోనూ సుముఖంగానే ఉన్నారు. ఇక రూర‌ల్ నుంచి జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే బుచ్చ‌య్య సీటు త్యాగం చేయ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు. జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే రూర‌ల్ సీటు ఖ‌చ్చితంగా జ‌న‌సేన‌కే ఇస్తారంటున్నారు. అక్క‌డ నుంచి ఆ పార్టీ కీల‌క నేత కందుల దుర్గేష్ బ‌రిలో ఉండడం దాదాపు ఖాయ‌మైంద‌నే అంటున్నారు. జ‌న‌సేన తో పొత్తు ఉంటే రాజ‌మండ్రి సిటీ, రూర‌ల్ రెండు నియో జ‌క‌వ‌ర్గాల ను కూడా టీడీపీ, జ‌న‌సేన బంప‌ర్ మెజార్టీతో గెలుచు కుంటాయని రెండు పార్టీ ల నేత‌లు చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: