భార‌త ఆర్మీ చేతికి త్రిశూల్‌, వ‌జ్ర‌..చైనాను తిప్పి కొట్టేందుకు సిద్ధం..

N ANJANEYULU
భార‌త స‌రిహ‌ద్దుల్లో క‌య్యానికి కాలు దువ్వుతూ ఉన్న చైనా ద‌య్యాన్ని వ‌దిలించుకునేందుకు త్రిశూలంతో సిద్ధంగా ఉంది భార‌త్‌. గ‌త ఏడాది గ‌ల్వాన్ వ్యాలీలో భార‌త్ సైన్యంపై ఇనుప‌రాడ్ల త‌ర‌హా ఆయుధాల‌తో చైనాకు చెందిన ఆర్మీ దాడికి య‌త్నించిన సంగ‌తి విధిత‌మే. అప్పుడే చైనా బ‌ల‌గాల‌ను భార‌త బ‌ల‌గాలు తిప్పికొట్టాయి. ఇప్పుడు నూత‌న ఆయుధాల‌ను స‌మ‌కూర్చుకుని సిద్ధంగా ఉన్నాయి. నూత‌న ఆయుధాలైన త్రిశూల్‌, వ‌జ్ర‌లు. స‌రిహ‌ద్దుల్లో కాల్పులు జ‌ర‌ప‌కూడ‌ద‌ని.. ఆయుధాలను వినియోగించ‌కూడ‌ద‌ని భార‌త్‌-చైనా మ‌ధ్య ఒప్పందం కుదిరింది.
ఈ త‌రుణంలోనే గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ త‌రువాత ప్రాణ‌హాని లేని ఆయుధాల‌పై భ‌ద్ర‌తాబ‌ల‌గాలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా నోయిడా అపాస్టెరాన్ ప్ర‌యివేటు లిమిటెడ్ అనే స్టార్ట‌ప్ కంపెనీకి ఈ ఆయుధాలను త‌యారుచేసే బాధ్య‌త అప్ప‌గించారు. ఎక్క‌డికైనా అత్యంత సులువుగా తీసుకెళ్లే విధంగా వెసులుబాటు ఉండ‌డం.. ప్రాణ‌హాని లేకుండా ప‌ర‌మ‌శివుని చేతిలో త్రిశూలం ఆధారంగా త్రిశూల్‌, వ‌జ్రా పేరుతో అపాస్టెరాన్ కంపెనీ ఆయుధాల‌ను త‌యారు చేసింది.
గ‌ల్వాన్ గొడ‌వ‌లో చైనా ఆర్మీ త‌మ సాంప్ర‌దాయ ఆయుధాల‌ను వినియోగించార‌ని అందుకు భిన్నంగా భార‌త సంప్ర‌దాయాన్ని చాటి చెబుతూ త్రిశూలాన్ని త‌యారు చేసిన‌ట్టు అపాస్టెరాన్ చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ మోహిత్‌కుమార్ వెల్ల‌డించారు. త్రిశూలం నుంచి క్ష‌ణాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా అవుతుంద‌ని..దీంతో సెక‌న్ల‌లో ప్ర‌త్య‌ర్థి షాక్‌కు గుర‌వుతాడ‌ని వివ‌రించారు. ఇక వ‌జ్ర పేరుతో మెట‌ల్ రాడ్ టేజ‌ర్‌ను కూడ ఈ సంస్థ త‌యారుచేసింది. శుత్రువుల సైనికుల‌తో హ్యాండ్ టూ హ్యాండ్ పోరాటంతో బుల్లెట్ ప్రూప్ వాహ‌నాల‌ను పంక్ష‌ర్ చేయ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌ప్ప‌ర్ పంచ్ పేరుతో నూత‌నంగా రూపొందించిన ప్రొటెక్ష‌న్ గ్లౌజులు తొడుక్కొని ఒక పంచ్ ఇస్తే..శ‌త్రువులు మూర్చ‌పోవాల్సిందేన‌ని వెల్ల‌డించారు. ఈ గ్లౌజ్‌ల నుంచి కూడ విద్యుత్ స‌ర‌ఫ‌రా అవుతుంది. దీని వ‌ల్ల ప్ర‌త్య‌ర్థి సెక‌న్ల కాలంలోనే షాక్ అవుతాడు. ఈ ఆయుధాలు శ‌త్రువు ప్రాణాలు ఏమి తీయ‌వు. వారికి షాక్‌కు మాత్ర‌మే గురిచేస్తాయి. భార‌త్ భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌కు ఆయుధాల‌ను అందించ‌డం మొద‌లుపెట్టిన‌ట్టు మోహిత్‌కుమార్ వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: