కుప్పంలో బాబుకు మరో దెబ్బ...తప్పించుకుంటారా..?

VUYYURU SUBHASH
వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట కుప్పం టార్గెట్‌గా ఎలాంటి రాజకీయం నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు బాబుకు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ వశం చేసేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారు. మొదట నుంచి కుప్పం టార్గెట్‌గానే రాజకీయం చేస్తూ సక్సెస్ కూడా అవుతున్నారు.
అసలు కుప్పంలో చంద్రబాబుకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. వరుసగా ఏడుసార్లు కుప్పంలో చంద్రబాబు సత్తా చాటారు. కానీ ఈ సారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని పెద్దిరెడ్డి ఫిక్స్ అయ్యారు. అందుకే కుప్పం ప్రజల్ని వైసీపీ వైపు తిప్పే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికల్లో కుప్పంలో టి‌డి‌పిని చిత్తు చేశారు. దాదాపు 90 శాతం పంచాయితీలు వైసీపీ వశమయ్యేలా చేశారు. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యి, కుప్పంలో మళ్ళీ పార్టీని గాడిలో పెట్టడానికి ప్రయత్నించారు...కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో టి‌డి‌పికి దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇక్కడ వైసీపీ మళ్ళీ సత్తా చాటింది. ఇదంతా పెద్దిరెడ్డి వ్యూహాలు వల్లే జరిగిందని చెప్పొచ్చు. ఇక పెద్దిరెడ్డి కుప్పం టార్గెట్‌గా మరో వ్యూహం రెడీ చేశారు. సాధారణ ఎన్నికలు కంటే ముందే కుప్పంలో మరో ఎన్నిక జరగనుంది. జగన్ ప్రభుత్వం కుప్పం పంచాయితీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చైనా విషయం తెలిసిందే. అయితే త్వరలోనే కుప్పం మున్సిపాలిటీకి ఎన్నిక జరగనుంది.
ఆ ఎన్నికలో సత్తా చాటాడానికి పెద్దిరెడ్డి ప్రిపేర్ అయిపోయారు. ఈ క్రమంలోనే వైసీపీ తరఫున బ్రాహ్మణ సామాజికవర్గానికి డాక్టర్ సుదీర్‌ను మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్ధిగా ప్రకటించేశారు. అటు చంద్రబాబు కూడా అలెర్ట్ అయ్యి... బలిజ సామాజిక వర్గానికి చెందిన అనగానిపల్లె మాజీ సర్పంచ్ త్రిలోక్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. మున్సిపాలిటీలో గెలవడం పెద్ద ఇబ్బంది కాదనే చెప్పొచ్చు. మరి ఈ సారి వైసీపీ విజయానికి చంద్రబాబు బ్రేక్ వేస్తారో లేదో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: