ఇజ్రాయిల్ అండ.. తాలిబన్ మంట..!

Chandrasekhar Reddy
ఆఫ్ఘనిస్తాన్ లో తమవాళ్లు ఉండబట్టి ఆయా దేశాలను తాలిబన్ లు ఇష్టానికి బెదిరించి పనులు చేయించుకుంటున్నారు. తాజాగా అమెరికా తో చర్చలు జరిపి నప్పుడు కూడా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పనులు చేయడం మానుకొని తమపై ఇతర ఉగ్రవాదులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయాలని లేదంటే ఖతార్ లో ఉన్న ఇతర దేశీయుల పరిస్థితి వేరే తీరుగా ఉంటుందని తాలిబన్ లు బెదిరించారు. దీనితో ఆయా దేశాల పరిస్థితి ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడింది. తాలిబన్ లకు లొంగిపోతే వాళ్ళ డిమాండ్స్ అన్నిటిని ఒప్పుకోవాల్సి ఉంటుంది. లేదంటే తమ దేశప్రజల ను పోగొట్టుకోవాల్సి ఉంటుంది.
అయితే ఇతర దేశాలు కాబుల్ నుండి వాళ్ళ మనుషులను ఆగష్టు 31 వరకు ప్రత్యేక విమానాల ద్వారా తరలించారు. కానీ భారత్ మాత్రం తాలిబన్ లతో ఆచితూచి ప్రవర్తించాలని యోచించి, తజికిస్తాన్ లో భారత సైనిక స్థావరం ఉన్నందున ఆ దేశ సరిహద్దులకు భారతీయులను తీసుకువచ్చి, అక్కడ నుండి స్వదేశానికి తీసుకువచ్చింది. అందువలన తాలిబన్ ల డిమాండ్ లకు లొంగాల్సిన పని లేకుండా పోయింది. అమెరికా లాంటి దేశాలు కూడా ఈ సందర్భంలో తాలిబన్ లు చెప్పిన దానికి ఒప్పుకుంటూ తమ ప్రజలను స్వదేశానికి చెప్పిన గడువులో చేర్చగలిగాయి. అయితే ఆయా దేశాలు ఇప్పుడు తాలిబన్ లను ఎదిరించి మాట్లాడలేకపోతున్నాయి. కారణం ఇంకా అక్కడ వాళ్ళ దేశ పౌరులు ఉన్నారు కాబట్టి.
అమెరికా ఆఫ్గాన్ వచ్చిన సందర్భంలో కూడా అక్కడ ఉన్న చదువుకున్న జడ్జిలు, లాయర్లు, ఇతర అధికారులు వారికి సహకరించారు. సైన్యం కూడా వాళ్ళ ద్వారానే నేరస్తులకు శిక్షలు వేయించింది. అందుకే తాలిబన్ లు ఒక్కసారి ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత ఆయా అధికారుల ను వేటాడటం మొదలుపెట్టారు. ఒక జడ్జి దొరికితే అతడిని ఏమి చేశారో ఇప్పటికి తెలియదు. తాలిబన్ లు ఆఫ్ఘన్ ను ఆక్రమించిన వెంటనే చేసిన పని, జైళ్లలో ఉన్న వారి దోస్తానాలను(ఉగ్రమూకలను) జైళ్లు బద్దలు కొట్టి మరి బయటకు తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన అధికారులు వేడుకోగా ఇజ్రాయిల్ వారిని చాటుగా వేరే సరిహద్దు నుండి బయటకు తెచ్చింది. దీనితో తాలిబన్ లు ఇజ్రాయిల్ పై గుర్రుగా ఉన్నారు. తామంటే అందరు బయపడి, ఏమీ చేయడానికి పూనుకోరనే ఉద్దేశ్యం ఇక వాళ్లకు ఉండకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: