ఇండియన్ తేజస్ కి డిమాండ్.. చైనాకు కొత్త తలనొప్పి?

praveen
భారత రక్షణ రంగం రోజురోజుకూ పటిష్టంగా మారిపోతుంది. ఒకప్పుడు అధునాతన టెక్నాలజీతో ఉన్న ఆయుధాలు కావాలి అంటే ఇతర దేశాల పైనే ఆధారపడేది భారత్.  ఈ క్రమంలోనే అధునాతన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటిలా ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం కాదు. ఏకంగా ఇతర దేశాలకు ఆయుధాలను విక్రయించే స్థాయికి ఎదిగింది భారత్.  ప్రస్తుతం కేంద్రంలో మోడీ సర్కార్ అటు రక్షణ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తుంది.

 ఇక వరుసగా నిధులు అందుతుండటంతో భారత రక్షణరంగ పరిశోధన సంస్థ  శాస్త్రవేత్తలు అందరూ కూడా ఎంతో వేగంగా వినూత్నమైన ఆయుధాలను తయారు చేయడంలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే పలు క్షిపణిలకు పరీక్షించి సక్సెస్ సాధించారు.  ఈ క్రమంలోనే డి ఆర్ డి ఓ  ఎంతో కృషి చేసి తేజస్ యుద్ధ విమానాలను కూడా తయారుచేసింది అన్న విషయం తెలిసిందే   అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగిన తేజస్ యుద్ధ విమానాలు ప్రస్తుతం భారత అమ్ములపొదిలో చేరుతున్నాయి. అదే సమయంలో ఇతర దేశాలు కూడా డి ఆర్ డి ఓ  తయారుచేసిన ఆయుధాలను కొనేందుకు ముందుకు వస్తూ ఉండటం గమనార్హం.

అయితే ప్రపంచంలో ఉన్న యుద్ధ విమానాల కంటే తాము తయారుచేసిన యుద్ధ విమానాలు ఎంతో శక్తి వంతమైనవి అంటూ చెప్పుకుంటూ ఉంటుంది చైనా. ఈ క్రమంలోనే తాము తయారుచేసిన జె 17 యుద్ధ విమానాలు  ఎంతో అప్గ్రేడెడ్ అంటూ అక్కడి పత్రికల ద్వారా బాగానే డబ్బా కొట్టించుకుంది. కానీ ఇప్పుడు ఆ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన దేశాలకు వాటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు చైనా యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భావించిన అర్జెంటీనా ఇప్పుడు మాత్రం చైనాను కాదని భారత్ నుంచి తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో అసలేం జరిగిందో అర్థం కాక తల పట్టుకునే పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: