ఆ వైసీపీ ఎమ్మెల్యేకు పవన్‌తో ఇబ్బందే....టీడీపీకి ప్లస్ అవుతుందా...?

VUYYURU SUBHASH

కేవలం మెగా ఫ్యామిలీ వల్ల ఏపీ రాజకీయాల్లో లబ్ది పొందిన నాయకులు చాలా మంది ఉన్నారు....పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ లాభపడిన నాయకులు ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీ వల్ల పరోక్షంగా లబ్ది పొందిన వారిలో జోగి రమేష్ ఒకరు. ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు...అది కూడా మెగా ఫ్యామిలీ చలువే అని చెప్పొచ్చు. ఎందుకంటే 2009 ఎన్నికల్లో జోగి రమేష్...పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ తరుపున బరిలో దిగిన జోగి....అప్పుడు టి‌డి‌పి నేత కాగిత వెంకట్రావుపై కేవలం 1192 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
కానీ అప్పుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం అభ్యర్ధికి 29 వేల ఓట్లు వచ్చాయి....అంటే టి‌డి‌పి ఓట్లు ఎక్కువగా చీల్చేశారు. దాని వల్ల జోగికి బెనిఫిట్ అయింది. 2019 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్...కాకపోతే ఈ సారి పవన్ కల్యాణ్...జనసేన అభ్యర్ధి ఓట్లు చీల్చారు. ఆ ఎన్నికల్లో జోగి వైసీపీ తరుపున బరిలో దిగి....టి‌డి‌పి అభ్యర్ధి కాగిత కృష్ణప్రసాద్‌పై దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
కానీ ఇక్కడ జనసేనకు పడిన ఓట్లు 25 వేలు. అంటే మళ్ళీ ఓట్లు చీలిపోయి జోగికి బెనిఫిట్ అయింది. ఇలా రెండు సార్లు మెగా ఫ్యామిలీ వల్ల ఓట్లు చీలిపోయి..టి‌డి‌పికి నష్టం జరిగి జోగికి లాభం జరిగింది. అయితే ఈ సారి పరిస్తితి అలా ఉండదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేనలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే ఆ రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే పెడనలో జోగికి మళ్ళీ గెలుపు కాస్త కష్టమైపోతుంది. పైగా గత ఎన్నికల మాదిరిగా, వచ్చే ఎన్నికల్లో జగన్ గాలికి అంత ఊపు ఉండదు. ఇటు ఎమ్మెల్యేగా జోగి హవా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఈ పరిస్తితులని చూసుకుంటే....నెక్స్ట్ పెడనలో జోగికి పవన్ దెబ్బ తగిలేలా ఉంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: