జ‌గ‌న్ ఇలాకా: త‌ప్పు కేసీఆర్ ది కాదు !

RATNA KISHORE
మోడీ, జ‌గ‌న్ క‌లిసి ఓ త‌ప్పు చేస్తున్నారు. కానీ ఈ త‌ప్పు తెలంగాణ‌ది అని చెబుతున్నారు గౌర‌వ విద్యుత్ శాఖ మంత్రి. విద్యుత్ కొనుగోలుపై ఉన్న గోల్ మాల్ ఏంట‌న్న‌ది ప్ర‌భుత్వం చెబితే చాలా మంచిదని, తాము నేర్చుకుంటాం అని కూడా అంటున్నారు టీడీపీ స‌భ్యులు. ఈ నేప‌థ్యంలో త‌ప్పు కేసీఆర్ ది అని చెప్ప‌డం స‌రికాదు. జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి పై కానీ థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్ప‌త్తిపై కానీ పెద్ద‌గా దృష్టి సారించ‌కుండా సింగ‌రేణి నుంచి బొగ్గు రావ‌డం లేదు అని బాలినేని అనే మంత్రి చెప్ప‌డం పెద్ద జోక్. గ్యాస్ కు సం బంధించి కూడా ఇక్క‌డ కేటాయింపులు పూర్త‌య్యాకే త‌రువాత మిగ‌తా ప్రాంతాల‌కు తీసుకుని పోవాలి. క‌నీసం ఈ పని కేంద్రం చేసే లా  ప్ర‌య‌త్నిస్తుందా రాష్ట్రం అంటే అదీ లేదు. దీని వ‌ల్ల గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి కాస్త‌యినా ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధ్య‌మ‌ని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా సింగ‌రేణి బొగ్గు కూడా మ‌న‌కు కావాల్సినంత ఇవ్వాలంటే ముందు పాత బ‌కాయిల లెక్క తేల్చాలి. అంతేకాదు రాష్ట్రం విడిపో యాక అప్ప‌ట్లో ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలు కొన్ని ఉన్నాయి.. అవి ఆరు వేల కోట్ల రూపాయ‌ల‌కు పైబ‌డే అని తెలు స్తోంది. అవి కూడా కేసీఆర్ ని అడిగి తెచ్చుకోవాలి. ఇవేవీ చేయ‌కుండా త‌ప్పు కే సీఆర్ ది అని అంటారేంటి?

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం కేసీఆర్ కాదు. అందుక‌ని మీరంతా పొరుగు పెద్ద‌ల‌పై బుర‌ద జ‌ల్ల‌డం మాను కోం డి. ఇప్ప‌టిదాకా కొనుగోలు ఒప్పందాలు అన్నీ జ‌గ‌న్ కు మేలు చేసేవే త‌ప్ప తెలంగాణ‌కు మేలు చేసేవో లేదా తెలంగాణ చెబితే కొనుగోలు చేసిన‌వో కావు. ఆ మాట‌కు వ‌స్తే సింగ‌రేణి బొగ్గు గ‌నుల‌కు జ‌గ‌న్ స‌ర్కారు చెల్లించాల్సిన బ‌కాయిలు చాలా ఉన్నాయి. అందుకే సంబంధిత వ‌ర్గాలు బొగ్గు స‌ర‌ఫ‌రా నిలిపివేశాయి అని స్ప‌ష్టంగా తెలుస్తోంది. బొగ్గు త‌వ్వ‌కాల‌పై కూడా ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌మై న స‌మాచార‌మే వ‌స్తోంది. కానీ ఏపీ అధికారులు మొద‌ట్నుంచి ఉత్ప‌త్తిపై కాకుండా కొనుగోలు పై ఎక్కువ ప్రేమ క‌నబ‌రిచారు. అం దుకు జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నాలూ కార‌ణం అయ్యాయి. దీంతో త‌ల‌కుమించిన భారంగా కొన‌గోలు వ్య‌వ‌హారం మారింది.

థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌ను గాడిలో పెట్ట‌క‌పోవ‌డమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ సంస్థ‌ల నుంచి రావాల్సిన విద్యుత్ అంత‌గా రావ‌డం లేదు. దీంతో సంబంధిత సంస్థలు ఇవ్వాల్సిన దాని క‌న్నా త‌క్కువ విద్యుత్ నే రాష్ట్రానికి ఇస్తున్నాయి. అదానీ గ్రూపుల‌తో ఉన్న ఒప్పం దాల కార‌ణంగా త్వ‌ర‌లో మ‌న‌కు ఒడిశా నుంచి బొగ్గు వ‌స్తుంది కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం అమాంతం పెరిగిపోతాయి. ప‌దేళ్ల‌లో ఎన్నడూ లేని విధంగా ఒక సంక్షోభానికి కార‌ణం జ‌గ‌న్ మరియు మోడీ అనే తెలుస్తోంది. వీరిద్ద‌రి వ‌ల్లే ఇన్ని స‌మ‌స్య‌లు అని కూడా చెబుతున్నారు ఇంకొంద‌రు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: