తాలిబన్ ల.. చెరలో 12వేల విదేశీయులు.. !

Chandrasekhar Reddy
తాలిబన్ లు అమెరికా ను కూడా పిలక పట్టుకొని ఆడుకుంటున్నారు. తాజాగా అమెరికా తాలిబన్ లతో చర్చలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం అధ్యక్షుల మధ్య జరగకపోయినప్పటికీ కింది స్థాయి అధికారులతో జరిగింది. ఈ సమావేశానికి ముందే అమెరికా వాణిజ్య ఒప్పందాలకు ఎప్పుడు సిద్దమే కానీ దేశాన్ని గుర్తించడం మాత్రం సాధ్యం కాదని ముందుగా స్పష్టం చేసే చర్చలకు పూనుకుంది. ఇదే అదును అనుకున్న తాలిబన్ లు తమ దేశానికి సంబంధించి అనేక ఆంక్షలు తొలగించాలని, అలాగే తీవ్రవాదులపై ఉన్న ఆంక్షలు కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే వారికి కావాల్సిన ఆర్థికపరమైన సాయం కూడా చేయాలని అడిగినట్టు తెలుస్తుంది.  
ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్స్ ఏవైనా అమలు కాని పక్షంలో ఖతార్ లో ఉన్న ఆయా విదేశీయుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోవాలని తాలిబన్ లు బెదిరిస్తున్నారు. దీనితో ఇప్పటి వరకు వాళ్ళు మారతారు అనే చివరి ఆశ కూడా నశించిపోయింది. ఖతార్ లో దాదాపు 12000 మంది అమెరికా, బ్రిటన్, ఫ్యాన్స్ లాంటి తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఎవరైనా తాలిబన్ జోలికి వచ్చినా లేదా తాలిబన్ ల డిమాండ్స్ తీర్చకపోయినా ఖతార్ లో ఉన్న విదేశీయులను బ్రతకనీయబోమని వాళ్ళు బహిరంగంగానే బెదిరిస్తున్నారు.
ఇక తాజాగా ఐఎస్ మసీద్ పై చేసిన దాడిని తాలిబన్ లు ప్రపంచం కోసం ఖండించినప్పటికీ ఆ రెండు వర్గాలు వేరు కాదని వారంతా ఒకే కోవకు చెందిన వారని, వాళ్ళు కావాలనే ఇలాంటి రక్తపాతానికి పాల్పడుతూ ప్రపంచం దృష్టిని తమవైపు మళ్లించడానికి లేదా తమ కిరాతకాలను ప్రపంచానికి చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాటిని పట్టించుకోని తాలిబన్ లను రక్షించడానికి పూనుకుంటే అంతకంటే వెర్రి తనం ఉండబోదని విశ్లేషకులు చెపుతున్నారు. గతంలో కూడా పాక్ తన దేశంలో తానే ఐఎస్ ద్వారా పేలుళ్లకు పాల్పడి, తమని తీవ్రవాదుల నుండి కాపాడాలని లేనిపోని భయాన్ని నటించినట్టే ఇప్పుడు తాలిబన్ లు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: