వైసీపీలో మంత్రి ప‌ద‌వి కోసం ఇద్ద‌రు రాజాల పోటీ ..?

VUYYURU SUBHASH
ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సమయం ఆసన్నమవుతుంది...ఎలాగో 100 శాతం మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని తెలియడంతో ప్రతి జిల్లాలోనూ ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరిలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాల్, పినిపే విశ్వరూప్‌లు జగన్ క్యాబినెట్‌లో ఉన్నారు.
ఇక ఈ ముగ్గురు సైడ్ అయితే...ఈ ముగ్గురు ప్లేస్‌లోకి ఎవరు వస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలువురు ఆశావాహులు పదవులు దక్కించుకోవాలని చూస్తున్నారు. కొండేటి చిట్టిబాబు, పొన్నాడ సతీశ్ కుమార్, దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజాలు పదవులు ఆశించే లిస్ట్‌లో ఉన్నారు. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కూడా క్యాబినెట్ రేసులో ఉన్నారు.
అయితే కాపు కోటాలో పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కాపు కోటాలో కన్నబాబు మంత్రిగా ఉన్నారు. ఇక ఆయన ప్లేస్‌లో తర్వాత క్యాబినెట్లోకి రావడానికి దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజాలు గట్టిగానే ట్రై చేస్తున్నారట. టి‌డి‌పి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కంచుకోట తునిలో వరుసగా రెండుసార్లు గెలిచిన దాడిశెట్టి రాజాకు కాపు కోటాలో పదవి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు రాజానగరంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జక్కంపూడి రాజా సైతం మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. జక్కంపూడికి కాపు వర్గంలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.
అటు జగ్గంపేటలో గెలిచిన జ్యోతుల చంటిబాబు సైతం కాపుల కోటాలో పదవి ఆశించే లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఇక బీసీ కోటాలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్ పదవి ఆశిస్తున్నారు. ఎస్సీ కోటాలో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సైతం పదవి ఆశిస్తున్నారు. మరి తూర్పు గోదావరి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: