మాకు రెండు సీట్లు కావాలి... బాబుకు ఈ నేత‌ల వార్నింగ్‌లు...!

VUYYURU SUBHASH
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం గా ఉన్న చంద్ర‌బాబు బాధ‌లు అన్నీ ఇన్నీ కావు. అస‌లే గ‌త ఎన్నిక‌ల లో పార్టీ చ‌రిత్ర లోనే ఎప్పుడూ లేనం త ఘోరం గా కేవ‌లం 23 సీట్ల తో స‌రిపెట్టుకుంది. అయితే ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి పార్టీ నేత‌లు ఎవ‌రికి వారు య‌మునా తీరే అన్న‌ట్టు గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంద‌రు అయితే పార్టీ మారిపోతున్నారు. అంతెందుకు చివ‌ర‌కు పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యే ల‌లో న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. రేప‌టి రోజు ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అయినా పార్టీలో ఉంటారా ? బ‌య‌ట‌కు వెళ్లిపోతారా ? అన్న‌ది కూడా చాలా సందేహాలే ఉన్నాయి.

ఇక సీనియ‌ర్ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల‌లో త‌మ‌కు రెండు సీట్లు కావాల‌ని బాబు పై ఒత్తిళ్లు చేస్తున్నారు. అనంత‌పురం జిల్లాలో ప‌రిటాల ఫ్యామిలీకి చంద్ర‌బాబు ధ‌ర్మ‌వ‌రం, రాఫ్తాడు రెండు సీట్లు ఇస్తున్న‌ట్టు చెప్పారు. దీంతో చాలా జిల్లాల్లో సీనియ‌ర్ నేత‌లు సైతం త‌మ‌కు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌లో రెండు సీట్లు కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. సీనియ‌ర్ నేత రాయపాటి సాంబశివరావు నరసరావుపేట పార్లమెంటుకు తన కుమార్తె, సత్తెనపల్లి సీటును తన కుమారుడు రంగారావుకు ఇవ్వాలని బాబుకు తాను చెప్పాన‌ని ఇప్ప‌టికే చెప్పేశారు.

ఇక విశాఖ జిల్లాలో అయ్యన్నపాత్రుడు కూడా రెండు స్థానాలను కోరేందుకు రెడీ అవుతున్నా ర‌ట‌. ఆయ‌న న‌ర్సీప‌ట్నం తో పాటు అన‌కాప‌ల్లి ఎంపీ సీటుపై క‌న్నేశారు.  మ‌రో సీనియ‌ర్ నే త యనమల రామకృష్ణుడు తన కుటుంబ సభ్యులకు తునితో పాటు కాకినాడ రూరల్ ఇవ్వాలని డిమాండ్లు తెర‌మీద కు తెస్తున్నారు. రాజ‌మండ్రిలో ఆదిరెడ్డి ఫ్యామిలీ ఎమ్మెల్యే టిక్కెట్ తో పాటు ఎంపీ టిక్కెట్ అడ‌గాల‌ని వెయిట్ చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో జేసీ సోద‌రులు, అటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ, భూమా కుటుంబాలు కూడా రెండేసి సీట్లు కావాల‌ని ఇప్ప‌టికే అంత‌ర్గ‌తంగా త‌మ సంభాష‌ణ‌ల్లో బ‌య‌ట పెడుతున్నారు. బాబు ఏదో ప‌రిటాల ఫ్యామిలీకి రెండు ఇస్తామ‌న్నారు. అయితే ఇప్పుడు అన్ని ఫ్యామిలీ లు రెండు సీట్లు అడిగితే బాబు మాత్రం ఎక్క‌డ నుంచి తెచ్చి ఇస్తారు. బాబు ఈ ప్ర‌తిపాద‌న‌కు ఎంత ఒత్తిడి ఉన్నా ఒప్పుకోర‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: