బెజవాడలో టీడీపీకి ట్రిపుల్ ధమాకా...

M N Amaleswara rao
ఏపీలో విజయవాడ(బెజవాడ) రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. ఎన్నికలు లేకపోయినా ఇక్కడ హాట్ హాట్ రాజకీయమే నడుస్తూ ఉంటుంది. పార్టీల పరంగానే కాదు...సొంత పార్టీలో నేతలే ప్రత్యర్ధులు మాదిరిగా తలపడుతూ రాజకీయాలని వేడెక్కిస్తారు. ముఖ్యంగా ప్రతిపక్ష టి‌డి‌పి నేతలు. అసలు మొదట నుంచి విజయవాడ టి‌డి‌పిలో వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలు కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బాగా బయటపడ్డాయి.


 ఆ గ్రూపు తగాదాల వల్లే గెలవాల్సిన కార్పొరేషన్ కూడా టి‌డి‌పి ఓడిపోయింది. అయితే ఇంకా గ్రూపు తగాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ రచ్చ వచ్చే ఎన్నికల వరకు నడిస్తే టి‌డి‌పికి ట్రిపుల్ ధమాకా ఖాయమని అర్ధమవుతుంది. ఎందుకంటే విజయవాడ నగరానికి సంబంధించి మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం తూర్పులో టి‌డి‌పి ఎమ్మెల్యే ఉన్నారు. సెంట్రల్, వెస్ట్ సీట్లు వైసీపీ కంట్రోల్‌లో ఉన్నాయి.
అయితే టి‌డి‌పికి మూడు సీట్లలో బలం ఉంది...పైగా ఇప్పుడుప్పుడే వైసీపీపై వ్యతిరేకత మొదలవుతుంది. ఇలాంటి సమయంలో టి‌డి‌పి నేతలు గ్రూపు రాజకీయాలు చేయకుండా కలిసికట్టుగా పనిచేస్తే మూడు నియోజకవర్గాలని గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ టి‌డి‌పికి పవన్ కల్యాణ్ సపోర్ట్ ఇస్తే ఇంకా సులువుగా మూడు సీట్లు గెలుచుకోవచ్చు. పొత్తు ఉన్నా లేకపోయినా సరే నగరంలో టి‌డి‌పికి గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
కానీ అలా కాకుండా గ్రూపు తగాదాలు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా టి‌డి‌పి నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే టి‌డి‌పి సిట్టింగ్ సీటుగా ఉన్న తూర్పులో వైసీపీ నేత దేవినేని అవినాష్ స్ట్రాంగ్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో టి‌డి‌పి నేతలు కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధించగలరు. బుద్దా వర్గం, కేశినేని వర్గం అంటూ హడావిడి చేస్తే అందరూ నష్టపోవాల్సిందే...ఫైనల్‌గా టి‌డి‌పి నష్టపోవాలి. ఇకనైనా టి‌డి‌పి నేతలు పంతం వీడి కలిసి పనిచేస్తే విజయవాడలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు...లేదంటే సునామీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: