కేశినేని ఎఫెక్ట్: గద్దె రూట్ మారుతుందా?

M N Amaleswara rao
బెజవాడలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి....ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. కాస్తో కూస్తో బలంగా ఉన్న విజయవాడలో సైతం నేతల గ్రూప్ తగాదాల వల్ల టి‌డి‌పి చాలా నష్టపోయింది. ఆ విషయం కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే క్లియర్ అయింది. టి‌డిపి కలిసికట్టుగా పనిచేసి ఉంటే విజయవాడ కార్పొరేషన్‌లో సత్తా చాటేవారు. కానీ అలా జరగలేదు. కార్పొరేషన్‌లో ఘోరంగా ఓడిపోయారు.
ఎన్నిక అయిపోయినా సరే విజయవాడ టి‌డి‌పిలో ఇంకా రచ్చ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ నాయకుల మధ్య ఏ మాత్రం సమన్వయం ఉండటం లేదు. గ్రూప్ తగాదాలు ఇంకా నడుస్తున్నాయి. బుద్దా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరాలు ఒక గ్రూపుగా....కేశినేని నాని, గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్‌లాంటి వారు మరో గ్రూపుగా విడిపోయి రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే వీరి రచ్చ వల్ల బెజవాడలో టి‌డి‌పి ఎంత నష్టపోవాలో అంత నష్టపోయింది.
పైగా ఈ గ్రూపు తగాదాల నేపథ్యంలో నెక్స్ట్ ఎన్నికల నుంచి పోటీకి దిగనని కేశినేని నాని తేల్చి చెప్పేశారు. అలాగే తన కుమార్తె శ్వేత కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పారు. అయితే పార్టీలో మాత్రం కొనసాగుతానని కేశినేని చెప్పారు. అయితే కేశినేని లాంటి నాయకుడు పోటీకి దిగకపోతే విజయవాడ పార్లమెంట్ పరిధిలో టి‌డి‌పికి చాలా వరకు డ్యామేజ్ జరిగేలా ఉంది. ఎందుకంటే నానికి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటప్పుడు నాని పోటీ నుంచి తప్పుకుంటే టి‌డి‌పికే నష్టం
అయితే నాని ఎప్పుడైతే పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారో అప్పటి నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. మామూలుగా గద్దె నియోజకవర్గంలో ఎప్పుడూ పర్యటిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య తగ్గించేశారు. అలాగే సోషల్ మీడియా, మీడియాల్లో కూడా కనిపించడం మానేశారు. అంటే నానికి మద్ధతుగానే గద్దె ఆ రూట్‌లో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇలా బలమైన ఇద్దరు నాయకులు సైలెంట్ అవ్వడం వల్ల టి‌డి‌పికే ఇబ్బంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: