పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించని విజయసాయి... వైసీపీలో ఏం జ‌రుగుతోంది ?

VUYYURU SUBHASH
ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కనిపించడం లేదు. అసలు ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతున్నా కూడా విజయసాయి బయటకు రావడం లేదు. అసలు ఏమయ్యారో ఎవరికి క్లారిటీ లేకుండా పోయింది. అసలు ఏది ఉన్నా లేకపోయినా ప్రతిరోజూ సోషల్ మీడియాలో విజయసాయి ....చంద్రబాబుని విమర్శిస్తూ పోస్టు పెట్టకుండా ఉండరు. ఏదొక అంశంలో బాబుపై విమర్శలు చేస్తూనే వస్తారు.

అటు పార్టీ పరంగా కూడా విజయసాయి స్ట్రాంగ్‌గా నిలబడుతూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బాగా హల్చల్ చేస్తూ ఉంటారు. అసలు పార్టీలు జగన్ తర్వాత పొజిషన్ విజయసాయిదే అని అంతా అనుకుంటారు. మరి అలాంటి నాయకుడు ఈ మధ్య అసలు కనిపించడం లేదు. అసలు చంద్రబాబు మాత్రమే కాదు...పవన్ కల్యాణ్ సైతం దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. పవన్-వైసీపీ నేతల మధ్య ఎలా మాటల యుద్ధం జరుగుతుందో కూడా తెలిసిందే.

మరి ఇంత జరుగుతున్నా కూడా విజయసాయి స్పందించడం లేదు. మామూలుగానే చంద్రబాబు, పవన్ అంటే ఒంటికాలి మీద లేస్తారు. అలాంటిది విజయసాయి దగ్గర నుంచి పవన్‌కు కౌంటర్లు రాలేదు. అయితే తన సోషల్ మీడియా ఖాతాలో ప్రభుత్వ కార్యక్రమాలు గురించి పోస్టులు వస్తున్నాయి గానీ, ప్రత్యర్ధులపై విమర్శలు మాత్రం రావడం లేదు. అసలు విజయసాయి ఏమయ్యారనేది వైసీపీ నేతలు కూడా చెప్పడం లేదు.

అయితే విజయసాయి విషయంలో టి‌డి‌పి వర్షన్‌ వేరుగా ఉంది. డ్రగ్స్ వ్యవహారంలో విజయసాయిరెడ్డితో పాటు అతని అల్లుడి ప్రమేయం కూడా ఉందని టి‌డి‌పి నేతలు అనుమానిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన డ్రగ్స్‌ గుజరాత్‌ పోర్టులో పట్టుబడటం దగ్గర నుంచి, వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విజయసాయి రెడ్డి అడ్రెస్ లేకుండా వెళ్లిపోయారని బుద్దా వెంకన్న ఆరోపిస్తున్నారు. అసలు విజయసాయి ఎక్కడ దాక్కున్నారో కనిపెట్టాలని అంటున్నారు. మరి చూడాలి విజయసాయి పోలిటికల్ స్క్రీన్‌పై ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: