కస్టడీలోకి విజయసాయి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు...?

Sahithya
ఏపీలో డ్రగ్స్ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుంది ఏంటీ అనేది సర్వత్రా ఆసక్తి పెరుగుతుంది. టీడీపీ నేతలు డ్రగ్స్ టెస్ట్ కి సంబంధించి సవాల్ చేసి ఇటీవల హైదరాబాద్ కూడా వెళ్ళిన సంగతి తెలిసిందే. టీడీపీ యువ నేతలు అందరూ డ్రగ్స్ టెస్ట్ కి సంబంధించి సిద్దంగా ఉన్నారని చెప్తూ కొన్ని నియోజకవర్గాల ఇంచార్జ్ లు హైదరాబాద్  వెళ్ళారు. అయినా సరే అధికార పార్టీ నుంచి స్పందన రాలేదు అనే సంగతి తెలిసిందే. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ ప్రభావం తో టీడీపీ డ్రగ్స్ కేసుకి సంబంధించి ఏది మాట్లాడినా సరే మీడియా పెద్దగా చూపించడం లేదు.
మీడియాలో ఉన్న వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోక పోవడం అనుకూల మీడియా కూడా చూపించకపోవడం టీడీపీ ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఇది పక్కన పెడితే తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ  రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో విజయసారెడ్డి ప్రమేయముంది అని వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాలతో సంబంధంలేక పోతే, విజయసాయి తన పార్టీ వారికి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నాడు? అని ఆయన నిలదీశారు. విజయసాయి రెడ్డి అల్లుడికి రాష్ట్రానికి చెందిన పోర్టుల్లో వాటాలున్నాయి అని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో వారికి తెలిసే పోర్టుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు విజయసాయిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే డ్రగ్స్ వ్యవహారం తాలూకా గుట్టుమట్లు బయటపడతాయి అని వ్యాఖ్యలు చేసారు. డ్రగ్స్ దందా సహా, ఇసుక, మద్యం, భూ ఆక్రమణల్లో విజయసాయిరెడ్డే రాష్ట్ర బిగ్ బాస్ కు సహకరిస్తున్నాడు అని విమర్శలు చేసారు. బిగ్ బాస్ కు తెలియకుండా విజయసాయిరెడ్డి ఏమీ చేయడనే వాస్తవం గ్రామాల్లో అరుగుల మీదకూర్చునే ప్రతిఒక్కరికీ తెలుసు అన్నారు. టీడీపీ అధికారంలోకివచ్చిన మరుక్షణం విజయసాయి అక్రమార్జన, అవినీతి గుట్టుమట్లను చేధిస్తుంది అని తెలిపారు. ఏ2 చేసిన అవినీతికి శిక్షలువేయాలంటే రాజ్యాంగంలో ఇప్పుడున్న శిక్షలుసరిపోవు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: