భార‌త్‌కు తొలిసారి లేఖ రాసిన తాలిబ‌న్లు.. ఎందుకంటే..?

Paloji Vinay
తాలిబ‌న్‌లు ఆఫ్ఘనిస్థాన్ ఆక్ర‌మించుకుని అధికారం చేప‌ట్టి దాదాపు నెల‌రోజులు అవుతుంది. ఇప్పుడు భార‌త ప్ర‌భుత్వానికి తొలిసారిగా లేఖ రాశారు తాలిబ‌న్ లు. ఇరు దేవాల మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ద‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ది ఇస్లామిక్ ఎమిరేట్ అఫ్ అఫ్గ‌నిస్తాన్ పేరుతో తాలిబ‌న్‌లు లేఖ రాశారు. ఈ మేర‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అరుణ్ కుమార్ కు ఆఫ్ఘనిస్థాన్ పౌర విమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హాజ్ హమీదుల్లా అకున్ జదా ఈ లేఖను పంపించారు.


 ఈ లేఖ సెప్టెంబర్ 7న రాసినట్లుగా ఉంది. అమెరికా బలగాలు అఫ్గ‌నిస్తాన్‌ను వ‌దిలి తిరిగి వెళ్లిపోయే క్ర‌మంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ ధ్వంసం అయింది.  అయితే ఖతార్ సాంకేతిక స‌హాయంతో ఎయిర్ పోర్ట్ ను పునరుద్ధరించామ‌ని,  ఈ మేరకు  ఈ నెల 6న ఎయిర్ మెన్ కు నోటీసును జారీ చేశామ‌ని లేఖ‌లో పేర్కొన్నారు హ‌మీదుల్లా అకున్ జ‌దా. దీనిని దృష్టిలో పెట్ట‌కుని భార‌త్‌-ఆఫ్ఘనిస్థాన్ మధ్య విమాన స‌ర్వీసుల‌ను పునరుద్ధరించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

   ఇరు దేశాల మధ్య ప్రయాణం సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నామ‌ని వెల్ల‌డించారు. త‌మ‌ అధికారిక ఎయిర్ లైన్స్ అయిన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ , లైన్ కామ్ ఎయిర్ ల‌ను తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. దీంతో మీ వాణిజ్య విమానాలు అఫ్గ‌న్‌కు వ‌చ్చేలా  ఏర్పాట్లు చేయాలని ఆ లేఖ‌లో కోరారు ఆయ‌న‌. అయితే, అఫ్గ‌న్‌లో తాలిబ‌న్‌ల పాల‌న‌ను భార‌త్ తీవ్రంగా వ్య‌తిరేకించిన విష‌యం తెలిసిందే. అలాగే ఆగ‌స్టు 31 దోహాలో జ‌రిగిన‌త స‌మావేశంలో తాలిబ‌న్‌లో పాల‌న‌ను అధికారికంగా గుర్తించ‌లేదు భార‌త్‌.


 ఖతార్ లోని భారత రాయబారి దీపక్ మిట్టల్ దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ అధిపతి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ని కలిసి చర్చలు జరిపిన అనంత‌రం కూడా ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ పాలనపైన అస‌హ‌నంగానే ఉంది భార‌త్‌. అలాగే తాలిబ‌న్‌ల‌తో భారత్ కు ప్రమాదం  ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తూనే వ‌స్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: