కేశినేని రూట్ మారుస్తున్నారా?

M N Amaleswara rao
బెజవాడ రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ముఖ్యంగా బెజవాడ టి‌డి‌పిలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన సరే విజయవాడ(బెజవాడ)లో మాత్రం పార్టీ బలంగా ఉంది. కానీ అనూహ్య పరిణామాల మధ్య బెజవాడలో టి‌డి‌పి వీక్ అవుతూ వస్తుంది. ఒకవైపు వైసీపీ రాజకీయాలకు టి‌డి‌పి చేతులెత్తేస్తుంది. మరోవైపు సొంత పార్టీలో ఉన్న లుకలుకలే టి‌డి‌పికి మైనస్ అవుతున్నాయి.


పైగా బలంగా ఉన్న వంగవీటి రాధా లాంటి నాయకుడు టి‌డి‌పికి దూరం జరిగారు. అటు దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్లారు. ఇటు ఏమో గ్రూపులు కట్టి మరీ టి‌డి‌పి నేతలు గొడవ పడుతున్నారు. కేశినేని నాని, గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్‌లు ఒక వర్గంగా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమాలు మరో వర్గంగా విడిపోయి గొడవలు పడుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఈ గ్రూపు వార్ ఏ స్థాయిలోకి వెళ్ళిందో అంతా చూశారు. ఈ రచ్చ వల్లే గెలవాల్సిన విజయవాడ కార్పొరేషన్‌లో టి‌డి‌పి ఓటమి పాలైంది.


ఈ ఓటమి తర్వాతైన నాయకులు మారలేదు. అదే విధంగా గ్రూపు తగాదాలు పెట్టుకుని ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ ఎన్నికల నుంచి పోటీకి దూరమవుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో ఉంటాను గానీ పోటీకి దిగనని చెప్పేశారు. తన కుమార్తె కేశినేని శ్వేత కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పారు.

 
అయితే ఇప్పటికే బెజవాడలో పార్టీ పరిస్తితి ఘోరంగా ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో కేశినేని కూడా సైడ్ అయితే పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని బెజవాడ తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు కేశినేనిని కలవడానికి క్యూ కట్టారు. 2024లో కూడా ఎంపీగా పోటీ చేయాలని కేశినేని నానిపై కార్యకర్తలు, నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అటు టి‌డి‌పి అధిష్టానం కూడా కేశినేనిని దూరం చేసుకోవాలని అనుకుంటున్నట్లు లేదు. మరి చూడాలి కేశినేని రూట్ ఏమన్నా మారుతుందేమో.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: