ఆ పత్రాలు ఎక్కడ...? యనమల లెక్కల చీటీ...?

Sahithya
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అప్పులు తప్ప.. ఆదాయం లేని రాష్ట్రంగా రికార్డులు సృష్టించింది అన్నారు. సంక్షేమంలో గత ప్రభుత్వం కన్నా తక్కువ ఖర్ఛు అని ఆయన పేర్కొన్నారు. 32శాతం నుండి 43శాతానికి ఆర్ధిక అసమానతలు పెరిగాయని ఆయన తెలిపారు. పేదరికంలో 6వ స్థానం నుండి 2వ స్థానానికి చేరిందని వివరణ ఇచ్చారు. రెండున్నరేళ్లుగా అప్పులే తప్ప.. ఆదాయ మార్గాలు లేవు అన్నారు ఆయన. తెచ్చిన అప్పులకూ లెక్కా పత్రం లేదు అని ఆరోపణలు చేసారు.
రూ.2,68,835 కోట్ల అప్పులో రూ.1.05 లక్ష కోట్లు సంక్షేమం అన్న ఆర్ధిక మంత్రి వాస్తవంలో ఖర్చు చేసింది రూ.68,632 కోట్లు మాత్రమే అని తెలిపారు. మిగిలిన రూ.1.99 లక్షల కోట్లు ఏమయ్యాయి.? అని ఆయన నిలదీశారు. కేపిటల్ ఎక్స్ పెండించర్ కోసం ఖర్చు చేసింది రూ.31వేల కోట్లు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఆ లెక్కన చూసుకున్నా రూ.1.68 లక్షల కోట్ల లెక్కలెక్కడ.? అని నిలదీశారు. ఎక్కడ ఖర్చు చేసినట్లు.? అని ప్రశ్నించారు.  ఎవరి జేబుల్లోకి మళ్లించినట్లు.? అని ఆయన ప్రశ్నించారు.
రెవెన్యూ కోసం ఖర్చు చేస్తే ఆర్ధిక నిబంధనలు ఉల్లంఘించినట్లే అని మండిపడ్డారు. రెండేళ్ల బడ్జెట్ లెక్కల ప్రకారం సంక్షేమం ఖర్చు రూ.68,632 కోట్లు మాత్రమే అన్నారు. టీడీపీ 17 సంక్షేమ పథకాలు అమలుచేస్తే వైసీపీ 5 పథకాలు మాత్రమే కొత్తవి అని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ ఖర్చులో దేశంలోనే 18వ స్థానంలో ఏపీ అని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018-19లో 3వ స్థానం అని గుర్తు చేసారు. ఇప్పటికీ అక్కడే ఉన్నారని అన్నారు. 2018-19లో పేదరికంలో 6వ స్థానంలో ఉంటే ప్రస్తుతం సెకెండ్ ప్లేస్ లో ఉందని తెలిపారు. ఆర్ధిక అసమానతలు 32 % నుండి 43% పెరిగాయి అన్నారు. ఎడాపెడా చేస్తున్న అప్పులు, ఆస్తులు తాకట్టు పెట్టిన సొమ్ము ఏమవుతోంది.? అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: